అరెస్ట్ అంటూ వార్తలు.. తెరపైకి పవన్ కళ్యాణ్, ఆ హీరోయిన్ పేర్లు .. మరో బాంబు పేల్చిన వేణుస్వామి

వేణుస్వామి ఇప్పటి వరకు ఎందరో సెలబ్రిటీలకు జోస్యం చెప్పారు, జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పరిహారాలు చెప్పడం, అవసరమైతే దగ్గరుండి పూజలు కూడా నిర్వహించేవారు. ఆయన చలవతో పలువురికి అద్భుతంగా ఫేట్ మారి కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. ఈ మౌత్ పబ్లిసిటీతో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందినవారు వేణుస్వామి ఇంటికి క్యూకట్టారు. జ్యోతిష్యులు చెప్పిన ప్రతి జోస్యం నూటికి నూరుశాతం నిజమవ్వడం అనేది రేర్. ఇందుకు ఎన్నో లెక్కలు, నక్షత్రాలు, గ్రహగతులు, ఘడియాలను పరిగణలోనికి తీసుకోవాలి. మిల్లీ సెకనుని తప్పుగా అంచనా వేసినా ఫలితం తేడా కొడుతుంది. ఇప్పుడు వేణుస్వామి విషయంలోనూ అదే జరుగుతోంది.

బీఆర్ఎస్ , ఐపీఎల్, ప్రభాస్ జాతకం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వేణుస్వామి చెప్పిన ప్రిడెక్షన్ తేడా కొట్టడంతో ఆయన ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటున్నారు. నెటిజన్లు కామ్‌గా ఊరుకుంటారా, వేణుస్వామిని ఓ ఆట ఆడుకుంటున్నారు. విషయం సద్దుమణిగి జనాలు సైలెంట్ అయినప్పడు.. కెలికిమరి కొట్టించుకున్నట్లుగా ప్రవర్తిస్తారు వేణుస్వామి. దీనికి బెస్ట్ యాగ్జాంపుల్ నాగచైతన్య - శోభితల ఇష్యూనే. వీరి ఎంగేజ్‌మెంట్ ఇలా అయ్యిందో లేదో.. వెంటనే లైన్‌లోకి వచ్చిన వేణుస్వామి ఈ జంట ఎంతోకాలం కలిసి ఉండరని, ఓ అమ్మాయి వల్ల త్వరలోనే విడిపోతారని కామెంట్ చేశారు.

Astrologer venu swamy reacts on fake news about his arrest after getting telangana women commission notice

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగగా.. విషయం పోలీస్ స్టేషన్‌కు, మహిళా కమీషన్ వరకు వెళ్లింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమీషన్ వేణుస్వామిని ఆదేశించింది. ఈ పరిణామాలతో ఆయన రేపో, మాపో అరెస్ట్ అవ్వడం ఖాయమేనని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. అలాగే బిగ్‌బాస్ 8 తెలుగులోనూ వేణుస్వామి ఆఫర్ కోల్పోయారని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి.

తనపై జరుగుతున్న ట్రోలింగ్, మహిళా కమీషన్ నోటీసులపై వేణుస్వామి స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన తన ఇంట్లో కూర్చొని ఉండగా.. తనను కలిసేందుకు వచ్చిన వారు వెయిట్ చేస్తుండటాన్ని గమనించవచ్చు. తాను అరెస్ట్ అయినట్లుగా ఏవో ఛానెల్స్‌ వార్తలను ఇస్తున్నాయని.. ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు తెలుసునని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ఓ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్నారని.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఎలా వేధించినది తాను చూశానని , అలాంటిది తాను జాతకాలు చెబితే ఎవరు అరెస్ట్ చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

నా పనుల్లో నేను బిజీగా ఉన్నానని.. ఎప్పటిలాగే నా ఆఫీసుల్లో పనులు జరుగుతున్నాయని వేణుస్వామి తెలిపారు. ఓ నెల రోజుల తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుకుందామని.. తాను సెలబ్రిటీ జాతకాలు చెప్పడం మానేశానని, కానీ రివ్యూలు చెప్పుకునే కొందరి గురించి మాత్రం చెబుతానని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ రివ్యూలు చెప్పే వ్యక్తులు ఎవరంటూ డిస్కషన్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X