AP elections 2024: సంచలన వీడియో వదిలిన వేణు స్వామి.. అందుకే జగన్ గెలుస్తాడని చెప్పా అంటూ!
ఎన్నో రోజుల పాటు ఉత్కంఠను రేపిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమికే ప్రజలు పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 160కి పైగా సీట్లలో గెలుపొందే దిశగా కూటమి దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మాట మార్చారు. అసలు ఆయన ఏం చెప్పారో మీరే చూసేయండి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొన్నారు. దీంతో వీళ్లే విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఏపీ ఫలితాలపై కామెంట్లు చేశారు.

గతంలో పలు ఇంటర్వ్యూల్లో వేణు స్వామి '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. పవన్ కల్యాణ్.. చంద్రబాబు జాతకాలు ఏమాత్రం బాలేవు. గ్రహాల రిత్యా వీళ్లిద్దరివీ ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం. పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం. 2017 నుంచి 2025 వరకూ వీళ్ల జాతకాల్లో శని ఉంది. కాబట్టి వీళ్ల జాతకాలను చూసినా సీఎం అయ్యే యోగం కనిపించడం లేదు' అన్నారు.
అయితే, ఇప్పుడు ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. దీంతో ఏపీలో కూటమి విజయం దిశగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేణు స్వామి ఓ వీడియోను విడుదల చేశారు. అందులో '2024 ఎన్నికలకు సంబంధించి నేను ఇచ్చిన అంచనాలో మోడీ గారి ప్రభావం తగ్గుతుందని, ఆంధ్రాలో జగన్‌మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పాను. కానీ, నా అంచనా పూర్తిగా తప్పింది. నేను చెప్పిన ప్రెడిక్షన్ వాళ్ల జాతకం ప్రకారమే చెప్పాను. కాబట్టి నా తప్పును ఒప్పుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications










