సమంత, చైతూ విడాకుల కారణం లీక్ చేసిన వేణు స్వామి: మరో సినీ జంట మధ్య విభేదాలు.. అందుకే దూరంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన అంశాల్లో సినీ జంట సమంత రూత్ ప్రభు - అక్కినేని నాగ చైతన్య విడాకులు ఒకటి. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్లిద్దరూ.. పెద్దల సమక్ష్యంతో పెళ్లాడారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కాపురం చేసిన వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అసలు వీళ్ల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయన్న దానిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, అసలు కారణం మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసమే!

ప్రేమ పెళ్లి.. ఎంజాయ్ చేసి: చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత సమంత, నాగ చైతన్య పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌ అనిపించుకున్నారు.

Venu Swamy

విడాకులతో షాకిచ్చిన జోడీ: టాలీవుడ్‌లోనే బెస్ట్ సినీ జంటగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోయామని పేర్కొన్నారు.

Venu Swamy

అసలు కారణం.. డౌట్లతోనే: సమంత.. నాగ చైతన్య విడాకుల తర్వాత ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీళ్లు విడిపోయి చాలా కాలం అవుతోన్నా అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలు అలాగే ఉన్నాయి. దీంతో ఎవరికి తోచిన విషయాన్ని వాళ్లు మాట్లాడుకుంటూ వస్తున్నారు.

Venu Swamy

వేణు స్వామి మళ్లీ చెప్పాడు: సమంత - నాగ చైతన్య విడాకుల తర్వాత ఒక్కసారిగా సెన్సేషనల్ అయ్యారు ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకముందే ఎన్నాళ్లో కలిసి కాపురం చేయరని చెప్పి షాకిచ్చిన ఆయన.. అది నిజం అవడంతో ఫుల్ పాపులర్ అయ్యారు. ఇక, చాలా గ్యాప్ తర్వాత ఆయన మరోసారి సమంత, నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడి కలకలం రేపేశారు.

Venu Swamy

ఆ ఫేమ్ వల్లే విభేదాలంటూ: తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణు స్వామి మాట్లాడుతూ.. 'సమంత, నాగ చైతన్య విడిపోడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే. వీళ్లిద్దరి జాతకంలో శని ఉచ్ఛ స్థితిలో ఉంది. అందుకే వీళ్లు కలిసి ఉండలేరు అని ముందే చెప్పాను. ఇలా ఉన్న జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుంది' అని వెల్లడించారు.

ఆ జంట మధ్యన విభేదాలు: ఆ తర్వాత వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'శని ఉచ్ఛ స్థితిలో ఉండే జాతకస్తుల్లో విభేదాలు ఏ రకంగా అయినా రావొచ్చు. గతంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఇగో వల్ల మనస్పర్థలు వచ్చాయి. ఆమెకు ఎక్కువ ఫేమ్ ఉండడం అతడు తట్టుకోలేకపోయాడు. కానీ, ఐశ్వర్యను సినిమాలకు దూరంగా ఉంచడంతో పాటు కొన్ని పూజలు చేయడంతో తేరుకున్నారు' అని చెప్పారు.

Venu Swamy

వీళ్లు కూడా అదే కారణంతో:సమంత, నాగ చైతన్య విడాకుల కారణాల గురించి చెబుతూ.. 'అప్పుడు అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ మధ్య వచ్చినట్లే సమంత - నాగ చైతన్యకు కూడా ఇగో వల్ల విభేదాలు వచ్చి ఉండొచ్చు. ఈ కారణంగానే వీళ్ల మధ్య దూరం పెరిగి విడాకులు తీసుకుని ఉండే అవకాశం ఉంది' అంటూ వేణు స్వామి వివరించారు. ఇప్పుడాయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X