సమంత, చైతులా మరో హీరో హీరోయిన్ జంట విడాకులు... వేణుస్వామి సంచలనం

ఈ మధ్యకాలంలో వేణు స్వామి ఎంతగా పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ... సినీ సెలబ్రిటీలకు పర్సనల్ జ్యోతిష్యుడుగా వ్యవహరించిన ఆయన సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆయన వరుసగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ వరుసగా హాట్ టాపిక్ అయ్యే అంశాలను బయటపెడుతూ వస్తున్నాడు. తాజాగా ఒక జంట విడిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

వేణు స్వామి అంటే ఇప్పుడు తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ పలానా హీరోయిన్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం తానేనని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అందులో కొంతవరకు నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన రష్మిక, ఈషా వంటి హీరోయిన్లకు పూజలు చేస్తున్న ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి.

venu swamy

అయితే నాగచైతన్య, సమంత వివాహం చేసుకుంటున్న సమయంలోనే వీరిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి ఎక్కువ కాలం కలిసి జీవించే అవకాశం లేదని ఆయన అప్పట్లోనే ఒక బాంబు పేల్చాడు. అయితే దీన్ని ఎవరు నమ్ముతారని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి నేను అప్పుడే చెప్పాను కదా అంటూ మరోసారి లైన్ లైట్లోకి వచ్చాడు.

venu swamy

దీంతో వేణు స్వామి చెబుతున్న జాతకాల మీద జనానికి గురి కుదురుతోంది. ఆయనకు స్వయంగా దగ్గరికి వెళ్లి జాతకాలు ఎంతమంది చెప్పించుకుంటున్నారో తెలియదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఆయన ఫాలో అయ్యే వారు మాత్రం పెరుగుతున్నారు. తాజాగా మరొక సినీ సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాంబు పేల్చాడు వేణు స్వామి.

venu swamy

ఆ సెలబ్రిటీ జంట మరెవరో కాదు ఈ మధ్యనే ప్రేమించి వివాహం చేసుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. ఒకప్పటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడైన ఆది పినిశెట్టి ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వచ్చిన అవకాశం కాదనకుండా చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన నిక్కీతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు.

venu swamy

అయితే వీరి జాతకం కలవకపోవడంతో వీరు విడిపోయే అవకాశాలు 80% వరకు ఉన్నాయని తాజాగా వేణు స్వామి కామెంట్లు చేశాడు. వారు విడిపోవాలని తాను చెప్పడం లేదు. కానీ వారి జాతకం ప్రకారం అలా ఉంది. కాబట్టి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే కలిసి ఉండడం ఉండకపోవడం అనేది వారి మనసులను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

aadhi pinisetty and nikki galrani

నిజంగా గనుక వీరు విడాకులు తీసుకుంటే వేణు స్వామి పేరు మరోసారి మారిపోకపోక తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉంటాయి అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X