Venu Swamy on Allu Arjun: అల్లు అర్జున్ జాతకం.. వేణుస్వామి చెప్పిందే నిజమైందిగా?
ఈ మధ్యకాలంలో వేణు స్వామి ఎంతగా పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ... సినీ సెలబ్రిటీలకు పర్సనల్ జ్యోతిష్యుడుగా వ్యవహరించిన ఆయన సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఇటీవల ఆయన అల్లు అర్జున్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక ఆ మాటలే నిజం అయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....
వేణు స్వామి అంటే ఇప్పుడు తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ పలానా హీరోయిన్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం తానేనని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అందులో కొంతవరకు నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన రష్మిక, ఈషా వంటి హీరోయిన్లకు పూజలు చేస్తున్న ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి.

అయితే నాగచైతన్య, సమంత వివాహం చేసుకుంటున్న సమయంలోనే వీరిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి ఎక్కువ కాలం కలిసి జీవించే అవకాశం లేదని ఆయన అప్పట్లోనే ఒక బాంబు పేల్చాడు. అయితే దీన్ని ఎవరు నమ్ముతారని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి నేను అప్పుడే చెప్పాను కదా అంటూ మరోసారి లైన్ లైట్లోకి వచ్చాడు.
ఇక వేణుస్వామి.. ఒక ఏడాది క్రితం అల్లు అర్జున్ జాతకం చెప్పాడు. నిన్నటికి నిన్న బన్నీకి నేషనల్ అవార్డ్ రావడంతో.. ఏడాది క్రితం వేణుస్వామి చెప్పిన జాతకం నిజమే అని అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. వేణుస్వామి ఆ వీడియోలో... తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్.. అల్లు అర్జున్ మాత్రమే. ఒక్కో సినిమాకు ఆయన 100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళుమూసుకుంటే 300 కోట్లు వచ్చేస్తాయి. నిర్మాతల గుండె ఆగిపోవడాలు, స్టంట్ వేయడాలు ఇలాంటి టెన్షన్స్ ఏం ఉండవు. అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అల్లు అర్జున్ కు రిస్క్ లేదు.. నిర్మాతలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ జాతకం .. సూపర్ స్టార్ జాతకం. ఇంకో పదేళ్లు తిరుగులేదు.. ఆయన ఈ పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన ఏ సినిమా తీసినా కూడా మినిమమ్ 200 కోట్లు వసూలు అవుతాయి. అల్లు అర్జున్ కు తిరుగు లేదు" అని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన చెప్పిందే నిజమైందని ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
వేణుస్వామి చెప్పడం... చెప్పిన విధంగానే అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు రావడంతో.. మరోసారి వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైంది. దీనితో ఆయన చెప్పినవి దాదాపు 99 పర్సంట్ నిజం అవ్వడంతో... ఆయన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











