For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో అక్కినేని నాగ చైతన్య.. సమంత విడాకుల వార్త ఒకటి. చాలా కాలం పాటు ప్రేమలో ముగిని తేలిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటైంది. ఆ తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారీ ఇద్దరు. అయితే, కొద్ది రోజులుగా వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సమంతకు అక్కినేని కుటుంబం నుంచి భరణం కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   అలా మొదలైన ప్రేమ.. పెళ్లితో ఒక్కటై

  అలా మొదలైన ప్రేమ.. పెళ్లితో ఒక్కటై

  నాగ చైతన్య.. సమంత కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫొటోను తొలిసారి చూశాడట. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ 'మనం' సినిమా సమయంలో నాగార్జునకు ఈ విషయాన్ని చెప్పి ఆ తర్వాత అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

   పెళ్లి తర్వాత క్రేజీగా.. సినిమాలు కూడా

  పెళ్లి తర్వాత క్రేజీగా.. సినిమాలు కూడా

  పెళ్లి చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య - సమంత కలిసి 'మజిలీ' అనే మూవీ చేశారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

  పేరు మార్చడంతో మొదలు.. వరుసగా

  పేరు మార్చడంతో మొదలు.. వరుసగా

  సోషల్ మీడియాలో సమంత ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య ఆమె తన సామాజిక మాధ్యమాల్లో అక్కినేని సమంత అని ఉండే పేరును S అని మార్చుకుంది. దీంతో అందరిలోనూ నాగ చైతన్యతో ఆమె విడిపోతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వరుసగా ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

   తెరపైకొచ్చిన జ్యోతిష్యుడు వేణు స్వామి

  తెరపైకొచ్చిన జ్యోతిష్యుడు వేణు స్వామి

  అప్పుడప్పుడూ వివాదాస్పద స్టేట్‌మెంట్లు ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకరు. సినీ, రాజకీయ రంగాలపై పట్టు ఉందని చెప్పుకునే ఆయన ఎన్నో విషయాలను ముందే అంచనా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత.. నాగ చైతన్య ఇష్యూపై స్పందించారు. దీన్ని మూడేళ్ల క్రితమే చెప్పానని ఆయన గుర్తు చేస్తున్నారు.

  పెళ్లి కాకముందే చెప్పేసిన వేణు స్వామి

  పెళ్లి కాకముందే చెప్పేసిన వేణు స్వామి

  మూడేళ్ల క్రితం వేణు స్వామి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అప్పటికి పెళ్లి చేసుకోని సమంత, నాగ చైతన్య భవిష్యత్ గురించి మాట్లాడారు. 'సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో వాళ్లకు సమస్యలు వస్తాయి. అంటే ఇద్దరి మధ్య దూరం రావొచ్చు, విడిపోవచ్చు లేదా పిల్లలు పుట్టకపోవచ్చు' అని అప్పటి వీడియోలో ఆయన వెల్లడించారు.

  Bigg Boss: అమ్మాయిగా మారింది అతడి వల్లే.. పెళ్లి చేసుకుంటానని చివరికి ఆ పని: ప్రియాంక సీక్రెట్ లీక్

  అఖిల్ గురించి కూడా ముందే చెప్పాడు

  అఖిల్ గురించి కూడా ముందే చెప్పాడు

  అక్కినేని అఖిల్ గతంలో శ్రేయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బంధం కూడా బ్రేకప్ అవుతుందని వేణు స్వామి చెప్పినట్లు ఆ వీడియోలో వెల్లడించారు. 'అఖిల్ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని ముందే చెప్పా. అప్పుడు నాగార్జున కేసులు వేస్తానని కూడా అన్నారు. కానీ, నేను చెప్పినట్లుగానే జరిగింది' అంటూ అప్పటి విషయాన్ని గుర్తు చేశారు.

  ఆ విషయంలో మాత్రం ఇద్దరూ సక్సెస్

  ఆ విషయంలో మాత్రం ఇద్దరూ సక్సెస్

  ఇదే ఇంటర్వ్యూలో సమంత, నాగ చైతన్య కెరీర్‌ల గురించి కూడా ప్రస్తావించారు వేణు స్వామి. 'పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన సమస్యలు వస్తాయి. కానీ, ప్రొఫెషనల్‌గా మాత్రం ఇద్దరూ సక్సెస్ అవుతారు. మరీ ముఖ్యంగా సమంత వరుసగా విజయాలను అందుకుంటుంది. ఇది వాళ్ల జాతకాలు తెలుసుకుని చెబుతున్నా' అంటూ చెప్పుకొచ్చారు.

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  Recommended Video

  Pelli SandaD Teaser | Teaser Launch By King Nagarjuna
  సమంతకు ఆ సమస్య.. అందుకే ఇలా

  సమంతకు ఆ సమస్య.. అందుకే ఇలా

  సమంతకు భవిష్యత్‌లో సమస్యలు ఎందుకు వస్తాయన్న దానిపై జ్యోతిష్యుడు వేణు స్వామి అంచనా వేశారు. 'సమంత అమావాస్య రోజు జన్మించింది. దాని వల్లే ఆమెకు భవిష్యత్‌లో వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు రావొచ్చని విశ్లేషించాను. ఈ ప్రభావం నాగ చైతన్య కెరీర్‌, లైఫ్‌పై కూడా తీవ్ర స్థాయిలో పడబోతుంది' అని ఆ ఇంటర్వ్యూలో వివరించారాయన.

  English summary
  Samantha Akkineni and Naga Chaitanya Divorce Rumors Hot Topic in Telugu States. Now Astrologer Venu Swamy Old Video About This Issue Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X