పవన్ నాలుగో పెళ్లి అప్పుడే.. ఏపీకి కాబోయే సీఎం ఆయనే: మరోసారి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇక, శనివారం సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అన్నింట్లోనూ దాదాపు ఒకే ఫలితం కాకుండా భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనే దానిపై తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

Astrologer Venu Swamy Shocking Comments On Pawan Kalyan Fourth Marriage

కూటమికే గెలుపు అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయి. దీంతో కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సైతం వెల్లడించాయి. వీటిలో ఎక్కువ శాతం సంస్థలు ఈ సారి ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని తెలిపాయి. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్పాయి.

Astrologer Venu Swamy Shocking Comments On Pawan Kalyan Fourth Marriage

జనసేనాని మాత్రం గెలుపు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ జనసేనాని భారీ మెజారిటీతో గెలుస్తారని, జనసేనకు 15 సీట్లు వస్తాయని ప్రకటించాయి.

Astrologer Venu Swamy Shocking Comments On Pawan Kalyan Fourth Marriage

వేణు స్వామి మళ్లీ కామెంట్
ఏపీలో ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై మరోసారి కామెంట్స్ చేశారు. తాజాగా ఓ న్యూస్ డిబెట్‌లో పాల్గొన్న వేణు స్వామి '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం' అని తెలిపారు.

Astrologer Venu Swamy Shocking Comments On Pawan Kalyan Fourth Marriage

నక్షత్రం ప్రకారమే సీఎం

వేణు స్వామి మాట్లాడుతూ.. 'నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా. ఏపీకి కాబోయే సీఎం జగన్‌మోహన్ రెడ్డే. ఆయన జాతకం ప్రకారం మళ్లీ సీఎం అయ్యే చాన్స్ ఉంది. జగన్ నక్షత్రం ప్రకారం.. 2023 నుంచి రెండేళ్ల పాటు అష్టమాన శని ఉంది. దీని ప్రభావం వల్ల మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని అర్థం చేసుకోవచ్చు' అంటూ వివరించారు.

వాళ్ల జాతకాలు బాలేవని
వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'పవన్ కల్యాణ్.. చంద్రబాబు జాతకాలు ఏమాత్రం బాలేవు. గ్రహాల రిత్యా వీళ్లిద్దరివీ ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం. పవన్ కల్యాణ్‌ది ఉత్తరాషాడ నక్షత్రం. 2017 నుంచి 2025 వరకూ వీళ్ల జాతకాల్లో శని ఉంది. కాబట్టి వీళ్ల జాతకాలను చూసినా సీఎం అయ్యే యోగం కనిపించడం లేదు' అని చెప్పుకొచ్చారు.

పవన్ నాలుగో పెళ్లి అప్పుడే

వేణు స్వామి కొనసాగిస్తూ.. 'ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. 2024 చివర్లో నాలుగో వివాహం చేసుకునే అవకాశం ఉంది. పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత జీవతంలో భాగం అయినప్పటికీ.. నాలుగోది మాత్రం జాతక ప్రభావంతో కచ్చితం చేసుకుంటాడు. ఆయన నాలుగు పెళ్లిళ్లు చూస్తుంటే దండం పెట్టాలని అనిపిస్తుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X