నాగచైతన్య, శోభితా మీరు నిశ్చితార్థం చేసుకోవడం ఏమిటి? వేణుస్వామి భార్య వాణి దారుణంగా సెటైర్స్!

నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం తెలుగు మీడియాలో అత్యంత వివాదంగా మారింది. ఈ ఇద్దరి వైవాహిక జీవితం గురించి జాతకం చెప్పిన వేణుస్వామిపై తెలుగు మీడియా అసోసియేషన్స్ తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడం మరింత ఝటిలమైంది. దాంతో వేణుస్వామి భార్య సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ రచ్చ చేసి మరింత చర్చకు దారి తీసేలా చేశారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 8వ తేదీన చైతూ, శోభితా నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వేణు స్వామి వారిద్దరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందనే విషయంపై తనదైన శైలిలో జాతకం చెప్పారు. పెళ్లి తర్వాత ఓ అమ్మాయి కారణంగా చైతూ, శోభితా విడిపోతారు అంటూ ఆయన బాంబు పేల్చారు. దాంతో ఆయన జాతకం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మహిళ కమిషన్ ఫిర్యాదు నేపథ్యంలో వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి పలు విషయాలను ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించి కొన్ని అంశాలపై మీడియా తీరును ప్రశ్నించారు.

Astrologer Venu Swamy wife Vani satires on Naga Chaitanya Sobhita Dhulipala engagement

వేణుస్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంపై ఆయన భార్య వీణా శ్రీవాణి తీవ్రంగా స్పందించింది. నేను వేణుస్వామి భార్యగా నేను ఈ వీడియో చేయడం లేదు. నేను అనేక సంవత్సరాలుగా మీడియాలో పనిచేసిన జర్నలిస్టుగా స్పందించాలని అనుకొంటున్నాను. నా తోటి సహచర జర్నలిస్టు నాకు ఓ మెసేజ్ పంపించారు. నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై వీడియో చేసిన ఫలానా జ్యోతిష్కుడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని మెసేజ్‌లో తెలిపారని ఆమె వెల్లడించారు.

టెలివిజన్ మీడియా, సోషల్ మీడియా‌లో జ్యోతిష్యులను ఎంకరేజ్ చేసింది ఎవరు మీరు కాదా? ఎవరైనా ప్రముఖుడు హాస్పిటల్‌లో చేరితే.. ఉంటాడా? పోతాడా? లేదా క్రికెట్ మ్యాచ్‌ జరిగితే ఇండియా గెలుస్తుందా? లేదా? అని స్టార్ట్ చేసింది మీడియా వారే కదా? ఆ డిబేట్లలు వేణుస్వామి లేకపోతే జరగవు. టీవీ రేటింగ్స్ కోసం వేణుస్వామి కావాల్సి వచ్చింది వాళ్లకు అని గట్టిగా నిలదీసింది.

నాగచైతన్య, శోభితా ధూళిపాలను ఉద్దేశించి కూడా వాణి వీడియో చేసింది. నిశ్చితార్థం చేసుకొన్న ఆమె మీకు కంగ్రాట్స్. మీరిద్దరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని దీవించింది. ఎందుకంటే మీరు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఏమిటి? నీ ఎంగేజ్‌మెంట్‌ న్యూస్‌ను డైవర్ట్ చేస్తూ యూత్ వేరే వాళ్లను టార్గేట్ చేయడం నాకు నచ్చలేదు. తుంటిని కొడితే పళ్లూడిపోయినట్టు అని ఆమె అన్నారు.

నిశ్చితార్థం జరుపుకొన్న నాగచైతన్య మీరు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నాకు పెద్దగా ఆశలు, కోరికలు లేవు. కేవలం ఎల్వీ కంపెనీలో లేటేస్ట్ బ్యాగ్ కొనిస్తే చాలూ. అంతకంటే నాకు ఏమీ వద్దు అని వీణా శ్రీవాణి వీడియోలో పరోక్షంగా సెటైర్లు వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X