అనుష్క, విరాట్ పెళ్లి పెటాకులే.. జ్యోతిష్కుల హెచ్చరిక.. ఇటలీలో పెళ్లి రద్దు!
Recommended Video

బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. కొద్దికాలంగా ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్న వారు ఇటలీలోని మిలాన్‌లో వివాహం చేసుకొంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. విరాట్, అనుష్క (విరుష్క)ల పెళ్లికి మిలాన్‌లో ఆర్బాటంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తల మధ్య ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.

విరుష్క దాంపత్య జీవితానికి ముప్పు
విరుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో పలు చానెళ్లు చర్చ కథనాలను ప్రసారం చేశాయి. ఓ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన చర్చ కార్యక్రమంలో జ్యోతిష్కుడు మాలవ్ భట్ మాట్లాడుతూ.. అనుష్క, విరాట్ మధ్య భావోద్వేగమైన విభేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆ కారణంగా వారి దాంపత్య జీవితానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అని వెల్లడించారు.

అనుష్క, విరాట్ జీవితంపై
అనుష్క, విరాట్ జీవితంపై గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి దాంపత్య జీవితంలో రానున్న రెండు సంవత్సరాలు చాలా కీలకం. కాబట్టి గ్రహాల పరిస్థితిని బట్టి వారి దాంపత్య జీవితం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి.

విరుష్క లైఫ్‌లో కలతలు, విభేదాలు
జోతిష్యం ప్రకారం విరుష్క వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడటానికి అవకాశం ఉంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక ఒడిదుడుకులు ఏర్పడుతాయి. దాంతో వారి జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది అని పలువురు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు.

జోరుగా ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు
జోత్యిష్కుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ విరుష్క పెళ్లి ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే వారి బంధువులు, సన్నిహితులు ఇటలీకి ప్రయాణమయ్యారు. అనుష్క ఇంటి పురోహితుడు కూడా ఇటీవల ఇటలీకి బయలుదేరి వెళ్లాడు.

డిసెంబర్ 15న మ్యారేజ్
తాజా సమాచారం ప్రకారం అనుష్క, విరాట్ పెళ్లి డిసెంబర్ 15న జరుగుతుందని తెలుస్తున్నది. డిసెంబర్ 21న ముంబైలో మ్యారేజ్ రిసెస్పన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్‌ను బుక్ చేసినట్టు సమాచారం.

అనుష్క, కోహ్లీ పెళ్లి రద్దుపై వార్తలు
ఇదిలా ఉండగా, శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓటమి పాలైన నేపథ్యంలో విరాట్, అనుష్క పెళ్లిపై సోషల్ మీడియాలో పలు జోకులు పేలుతున్నాయి. ఇప్పుడే అందిన వార్త.. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ పెళ్లి వాయిదా పడింది. సాయంత్రమే కోహ్లీ వచ్చి జట్టులో చేరుతాడని బీసీసీఐ ప్రకటించింది అని, అలాగే బ్రేకింగ్ న్యూస్ కోహ్లీ-అనుష్క వివాహం రద్దు. కోహ్లీ వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో రిపోర్ట్ చేయాలని రవిశాస్త్రి ఆదేశం అని వార్తలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











