twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌కు సీక్వెల్.. ఆపై సగౌరవంగా రిటైర్మెంట్.. ఆసక్తికర విషయాలు చెప్పిన నిర్మాత

    |

    తెలుగు చిత్ర సీమ చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతీ సందర్భంలో ఉటంకిచాల్సిన కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి జాబితాలో ఉండే చిత్రమే జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం సృష్టించిన చరిత్ర, తిరగరాసిన రికార్డులు, నెలకొల్పిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. మే 9 నాటికి ఈ చిత్రం విడుదలై ముప్పై యేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి అనేక విషయాలను వెల్లడిస్తోంది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.

    'జగదేకవీరుడు' అద్బుతాన్ని ప్లాన్ చేయలేం.. 'అతిలోక సుందరి' అలా జరిగిందంతే.. చిరు కామెంట్'జగదేకవీరుడు' అద్బుతాన్ని ప్లాన్ చేయలేం.. 'అతిలోక సుందరి' అలా జరిగిందంతే.. చిరు కామెంట్

    మూడు దశాబ్దాలు.. మూడు సంగతులు..

    మూడు దశాబ్దాలు.. మూడు సంగతులు..

    క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరికి ముప్పై యేళ్లు నిండుతున్న సందర్భంగా ఇప్పటికే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని మూడు సంగతులను నాని నోటి నుంచి చెప్పిస్తున్నారు. అందులో భాగంగా మొదటి విషయాన్ని మే 5న విడుదల చేసింది.

    కథ అలా మొదలైంది..

    కథ అలా మొదలైంది..

    జగదేకవీరుడు కథను రచయిత అయిన శ్రీనివాస్ చక్రవర్తి రాఘవేంద్రరావుతో చెప్పాడట. ఆ లైన్ నచ్చడంతో ఈ చిత్రాన్ని అక్కడ భీజం పడిందట. అలా ఈ కథలోకి జంధ్యాల, విజయేంద్ర ప్రసాద్, యండమూరి వీరేంద్రనాథ్ వంటి వారు వచ్చి చేరారట. ఇక నేడు మరో విషయాన్ని తెలుపనున్నారు. అంతుకు మునుపే చిరు స్పందించి.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

    టైమ్ లెస్ సినిమా..

    టైమ్ లెస్ సినిమా..

    క్లాసిక్ చిత్రాల నిర్వచనం చెబుతూ జగదేక వీరుడు గురించి చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ 25 చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు తప్పక స్థానం ఉంటుందన్నాడు. ఇది పాత తరం సినిమా.. కొత్త తరం సినిమా అనే తేడా లేకుండా అన్ని తరాలను అలరించే టైమ్ లెస్ క్లాసిక్ అని ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమ'ని చెప్పుకొచ్చాడు.

    సీక్వెల్ ప్రయత్నాలు..

    సీక్వెల్ ప్రయత్నాలు..

    కానీ ఈ చిత్రానికి సీక్వెల్ అన్న వార్తలు ఎప్పటి నుంచో ఊరిస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లు నటిస్తే ఎంతో బాగుంటుందని అప్పట్లో వార్తలు తెగ పుట్టుకొచ్చాయి. సీక్వెల్‌పై దర్శక నిర్మాతలు, చిరంజీవి పలు సందర్భాల్లో ప్రస్థావించిన సంగతి తెలిసిందే. తాజాగా అశ్వనీదత్ సీక్వెల్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

    Recommended Video

    30 Years Of Classic Jagadekaveerudu Athiloka Sundari, Here’s The 1 St Story Behind Film
    గౌరవంగా రిటైర్మైంట్ ..

    గౌరవంగా రిటైర్మైంట్ ..

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేయిస్తున్నట్టు అశ్వనీదత్ తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ తీసి చిత్ర పరిశ్రమ నుంచి గౌరవంగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని కూడా చెప్పాడు. అయితే హీరో హీరోయిన్లు డైరెక్టర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.

    English summary
    Aswani Dutt About Sequel Of Jagadeka Veerudu Athiloka Sundari. Aswani Dutt About Sequel Of Jagadeka Veerudu Athiloka Sundari
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X