twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్ల ఓపెనింగ్స్‌పై అశ్వినీదత్ షాకింగ్ కామెంట్స్.. ఆ హక్కు మనకు లేదంటూ ప్రకటన

    |

    ఓటీటీ, థియేటర్ రిలీజ్ మధ్య హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య ఏదో ఒక వివాదం జరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య సూర్య నిర్మించగా.. జ్యోతిక నటించిన చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల కోలీవుడ్ నిర్మాతల మండలి, థియేటర్ల యాజమాన్యం ఎంతగా రచ్చ చేసిందో తెలిసిందే. తాజాగా సూర్య తన సినిమా (సూరారై పొట్రు)ను ఓటీటీలో రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించాడు. ఇక ఈ నిర్ణయంపై సింగం డైరెక్టర్ హరి స్పందించాడు. సూర్య తన నిర్ణయంపై పునరాలోచించాలని సలహా ఇచ్చాడు. ఇక ఈ విషయంపై వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ స్పందించారు.

    వచ్చే జనవరి వరకు..

    వచ్చే జనవరి వరకు..

    నిజానికి వచ్చే జనవరి నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఆ తరువాత కూడా ఎలా ఉంటుందనేది అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమాలను థియేటర్లలోనే చూడండి అని ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పు అని అశ్వనీదత్ తెలిపారు.

    వారి నిర్ణయాన్ని..

    వారి నిర్ణయాన్ని..

    అందుకని ఓటీటలో నేరుగా ఆశాశం నీ హద్దురా (సూరారై పొట్రు) చిత్రాన్ని విడుదత చేయాలని సంకల్పించిన సూర్, వీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించిన నానిలను నేను అభినందిస్తున్నాను. వీ చిత్రం తనకు మైలు రాయి లాంటి 25వ చిత్రమైనప్పటికీ నేటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో విడుదల చేయడానికి నాని అంగీకరించడం ఎంతైనా అభినందనీయం అని అశ్వనీదత్ ప్రశంసించారు.

    ఆయనకు అభిమానిని..

    ఆయనకు అభిమానిని..

    ఇంట్లో క్షేమంగా ఉంటూ, ఎంటర్టైన్మెంట్ కోరుకునేవాళ్లందరికీ సూర్య, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ హరి సినిమాలకు నేను అభిమానిని. ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాల్సిందిగా ఆయనను కోరుతున్నాను అని అశ్వనీదత్ తెలిపారు.

    Recommended Video

    Vyjayanthi Movies Recalls SR NTR Humble Nature Towards Producers
    ఆ హక్కు మనకు లేదు..

    ఆ హక్కు మనకు లేదు..

    సూర్య సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆయన అభిమానులందరూ పరుగెత్తుకుని వచ్చేస్తారు. అయితే వారి ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మనకు లేదని గ్రహించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని అశ్వనీదత్ పేర్కొన్నారు.

    English summary
    Aswani Dutt Supports Suriya Decision On OTT And Soorarai pottru. Theaters have been closed for last 6 months and it is not sagacious to re-open theaters and play with lives of audiences under these condition
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X