రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి సినిమాను తెలుగులోనూ నిర్మించడానికి అశ్వనీదత్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందుకు రజనీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పూర్తి స్థాయి సమాచారం మరికొద్దిరోజులలో తెలియనున్నది. తమిళంలో ఈ సినిమాను కె.బాలచందర్ తన నిర్మాణ సంస్థ కవితాలయ సంస్థ ద్వారా రూపొందించనున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో విజయవంతమైన కథా పెరియాంబల్ సినిమా రీమేకే ఈ సినిమాగా తెలుస్తోంది.