మహేష్, చరణ్‌ల ద్వారా పోగొట్టుకుంది వస్తుందా?

By Bojja Kumar

బాలు, సుభాష్ చంద్రబోస్, జై చిరంజీవ, సైనికుడు, శక్తి... ఇలా వరుస ప్లాపులతో సతమతం అయింది వైజయంతి మూవీస్. దీంతో ఈ సంస్థ అధినేత అశ్వినీదత్ పొగొట్టుకుంది ఎలాగైనా రాబట్టుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సంవత్సరం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెండు భారీ సినిమాలకు శ్రీకారం చుట్టారు.

రామ్ చరణ్ హీరోగా రూపొంద బోయే సినిమాకు ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు-క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమాను ప్లాన్ చేశాడు ఈ మెగా నిర్మాత. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో.....ఎక్కువ సంఖ్యలో థియేటర్లను సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తే ఓపెనింగ్స్ భారీగా వసూలయి మంచి లాభాలు వస్తాయిని ఆయన ఆలోచనగా కనిపిస్తోందనే వాదన ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

మహేష్ బాబును 'రాజ కుమారుడు' సినిమా ద్వారా, రామ్ చరణ్ తేజను 'చిరుత' సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది అశ్వినీ దత్తే. ఈ నేపథ్యంలో నష్టాల్లో ఉన్న తన సంస్థను ఈ ఇద్దరే గట్టెక్కిస్తారని బోలెడు ఆశలు పెట్టుకున్నాడట ఈ నిర్మాత. మరి నిర్మాత ప్రయత్నం ఏంత మేరకు నెరవేరుతుందో కాలమే నిర్ణయించాలి.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' షూటింగుతో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో నటించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X