ప్రస్తుతం క్వీన్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ ‘కాజల్‌’

By Sindhu

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌ పాత్ర పూర్తిగా గ్లామర్‌కే పరిమితమైపోతోంది. అయితే పాట, లేకుంటే ఆట అన్నట్టు తారలు తలుక్కుమంటున్నాయి. అలనాటి నటీమణులు..జయసుధ, జయప్రద, రాధిక, రాధ, విజయశాంతి...మొదలైనవారు చిత్రంలో తమదైన ముద్ర వేసేవారు. సగటు మహిళను ప్రతిబింబించే పాత్రలు తెరపై కనబడేవి. ఇప్పుడంత సీన్‌ లేదు. హీరోయిన్‌ వెంటపడటం నేటి టాలీవుడ్‌ స్టైల్‌. తెలుగులో వచ్చిన అరుంధతి, మనోరమ, 16 డేస్‌, కావ్యాస్‌ డైరీ నేటి ఆధునిక మహిళను కదిలించలేకపోతున్నాయి. 'అరుంధతి' బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టినా కథ పరంగా, నటన పరంగా మార్కులేయలేం అని నంది అవార్డు కమిటీ సైతం తేల్చిచెప్పింది. 2009 సంవత్సరం టాలీవుడ్‌కు సంబంధించి ఆ నలుగురిగా అనుష్క, ఇలియానా, త్రిష, కాజల్‌..లను చెప్పుకోవచ్చు.

గత సంవత్సరం 6 చిత్రాలు చేసిన అనుష్క ఈ సంవత్సరం రెండు చిత్రాలతో సరిపెట్టింది. అందులో 'అరుంధతి' బాక్సీఫీస్‌ హిట్‌. రెండో చిత్రం 'బిల్లా' మాత్రం అంతంతమాత్రంగా అయిపోయింది. ఈ రెండు చిత్రాలతో అనుష్క రేంజ్‌ మాత్రం బాగా పెరిగింది. ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథలతో ప్రొడ్యూసర్లు లైను కట్టారు. కానీ తెలివిగా అలాంటి మరో చిత్రానికి అనుష్క కమిట్‌ కాలేదు. 'అరుంధతి' క్రెడిట్‌ అంతా దర్శకనిర్మాతలదే అని సవినయంగా తెలుపుకుంది.

త్రిష నాయికగా 'ఆకాశమంత' పెరు తెచ్చుకుంది. ఓ మంచి చిత్రం చేయడం ద్వారా. 'శంఖం' మాత్రం పరాజయం పాలైంది. గ్లామర్‌ పరంగానే గాక హీరోకు సరిజోడుగా నిలబడే సత్తా త్రిషకుంది. సన్నివేశాన్ని పండించడంలో అగ్రతాంబూలం త్రిషకే దక్కుతుందని విమర్శకుల అభిప్రాయం. హాస్యాన్ని పండించడంలో తారలందరికన్నా త్రిష ముందుంది.

ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులకు ఓ 'కిక్‌' ఇచ్చిన నటీమణి ఇలియానా. క్యూట్‌ గ్లామర్‌ గర్ల్ గా ఈ చిత్రంలో ఆహ్లాదంగా కనిపించి మెప్పించింది. తెలుగు భాష నేర్చుకుని ఇప్పుడిప్పుడే కాస్త నటనవైపు సాగుతున్నట్టు ఇలియానా అంటోంది. రెచ్చిపో, సలీమ్‌ చిత్రాలు బిగ్‌ డిజాస్టర్స్‌గా నిలిచిపోయాయి. వీటిలో గ్లామర్‌ పరంగా కొత్తదనం కనిపించింది.

దక్షిణాది చిత్రాలన్నీ ఓ చుట్టేస్తున్న నటి శ్రియ. పిస్తా, మల్లన్న..వంటి ద్విభాషా చిత్రాల్లో తళుక్కుమంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు లేవు. ప్రస్తుతం క్వీన్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా కాజల్‌ను చెప్పుకుంటున్నారు. 'మగధీరు'డి కత్తివిన్యాసాల కన్నా కాజల్‌ను చూడ్డానికే థియేటరుకు వెళ్లారని ఇండిస్ట్రీలో టాక్‌ ! హీరోలకు ధీటుగా కుర్రకారును థియేటర్లకు రప్పిస్తున్న ఏకైక అందాల నటి కాజల్‌. గణేష్‌, ఆర్య-2 చిత్రాలతో తన హవాను కొనసాగించింది. స్టార్‌డమ్‌ సంపాదించిన నటిగా కాజల్‌ను సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X