షాంఘైలో రాజమౌళి హంగామా
హైదరాబాద్ : రాజమౌళి షాంఘై ప్రయాణమై వెళ్లారు. ఆయన 'ఈగ' చిత్రం ఆయన్ని మోసుకెళ్లింది. ఇటీవల కాన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేసిన 'ఈగ' ఇప్పుడు షాంఘై వెళ్లింది. అక్కడ జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనకు ఎంపికైంది. అందులో పాల్గొనేందుకు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా షాంఘై వెళ్లారు.
'ఈగ'తో పాటు బాలీవుడ్ చిత్రాలు 'త్రీ ఇడియట్స్', 'జాలీ ఎల్.ఎల్.బి', 'మర్డర్ 3', 'బర్ఫీ', 'పుష్పక్' కూడా షాంఘై చిత్రోత్సవంలో ప్రదర్శితం కాబోతున్నాయి. రాజమౌళి 'ఈగ' ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు, ఆయన తెరకెక్కించనున్న 'బాహుబలి' కోసం లొకేషన్లను కూడా పరిశీలిస్తారు. ఆ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క హీరోయిన్ . రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న చిత్రమిది. కొన్ని నెలలుగా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
నటీనటులు ఇప్పటికే యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారు. తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications












