జర్మనీలో ఉండగా రూమర్ స్టార్టైంది...కాజల్
నాగచైతన్యతో 'దడ' సినిమా కోసం జర్మనీలో ఉండగా ఈ ప్రచారం మొదలైంది. నా గురించీ, నా వ్యక్తిత్వం గురించి అందరికీ తెలుసు. దక్షిణాది చిత్రాల్ని వదులుకొనే ప్రసక్తే లేదు. నాలుగేళ్లలో 20 పైచిలుకు సినిమాల్లో నటించాను. భవిష్యత్తులోనూ మంచి చిత్రాలు చేయాలని ఉంది అంది కాజల్. ప్రముఖ తమిళ దర్శకుడు రీసెంట్ గా కాజల్ ని సేల్స్ గర్ల్ గా పనిచేసే ఆమెను తెచ్చి హీరోయిన్ చేసానని, అలాంటి ఆమె పొగరుతో మాట్లాడటం క్షమించాల్సిన తప్పుకాదని కామెంట్ చేయటం ఆమెను కంగారు పెట్టి ఇలా స్పందించింది. 'సింగం' సినిమా ప్రచారంలో భాగంగా కాజల్ ఆ మద్య... నేను దక్షిణాది అమ్మాయిని అని ఎప్పుడూ అనుకోలేదు అనటంతో సమస్య మొదలైంది.ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి రోజూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్దితికి చేరుకుంది.


Click it and Unblock the Notifications











