twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎన్నో కష్టాలు పడ్డాను, లైంగికంగా లొంగిపోయాను: కంగనా రనౌత్‌

    ‘అమ్మాయిలు ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో విహరించే సమయంలో నేను ఎంతో కష్టపడ్డాను. సుదీర్ఘంగా పనిచేయాల్సి వచ్చేది". అని చెప్పింది కంగన

    |

    కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి. అమ్మా నాన్నలు ఆమెని డాక్టర్ ని చేయాలనుకున్నారట కానీ మొండితనం, పట్టుదలా ఎక్కువ ఉన్న ఈ అమ్మాయి మాత్రం నటి అవ్వాలనుకుంది 16 ఏళ్ళ వయసు లో అన్ని ఆంక్షలనీ దాటుకొని కుటుంబం తో తెగదెంపులు చేసుకున్నంత పని చేసి మరీ డిల్లీ బయల్దేరింది. కష్టాలు పడింది, పస్తులు పడుకుంది కానీ అనుకున్నది సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో కంగనా ఒకరు.

    బాలీవుడ్ మొత్తం కంగనా నోటికి భయపడుతుంది

    బాలీవుడ్ మొత్తం కంగనా నోటికి భయపడుతుంది

    ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న కంగనా కి ఇలాగే మాట్లాడాలీ ఇలాగే ఉండాలీ అన్న నిబందనలేమీ లేవు అందుకే బాలీవుడ్ మొత్తం కంగనా నోటికి భయపడుతుంది. ఎప్పుడు ఎవరిని నిర్మొహమాటంగా ఏకి పారేస్తుందో అన్న అనుమానం తో కంగనా జోలికి వెళ్లటానికే భయపడతారు అంతా... .

    లైంగికంగా లొంగిపోయాను

    లైంగికంగా లొంగిపోయాను

    కెరీర్ తొలినాళ్ళ లో తెలిసి తెలియక అవకాశాల కోసం చాలామంది కి లైంగికంగా లొంగిపోయాననీ చెప్పి ఒక్కసారి బాలీవుడ్ మొత్తాన్నీ బాంబ్ లా పేల్చేసింది..బాలీవుడ్ లో పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు నన్ను బాగా వాడుకున్నారని అయితే అప్పట్లో తెలియక చేయాల్సి వచ్చిందని చెప్పింది

    భయపడటం రాదు

    భయపడటం రాదు

    కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అలా లొంగి పోవాల్సిన అవసరం లేదని లౌక్యంగా వ్యవహరించాలని చెప్పి ఎవరెవరు నాతో ఆడుకున్నారో వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. మొహమాటం తెలియదు, భయపడటం రాదు అందుకే కంగనా అంటే భయపడుతూనే ఆమెని అభిమానంగా చూస్తుంది బాలీవుడ్...

    అనుపమ్‌ ఖేర్స్‌ పీపుల్‌

    అనుపమ్‌ ఖేర్స్‌ పీపుల్‌

    ఇలా ముక్కుసూటిగా మాట్లాడే కంగనా తాజాగా ఓ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘అనుపమ్‌ ఖేర్స్‌ పీపుల్‌' షోలో మాట్లాడింది తన కెరీర్ మొదలు పెట్టే రోజుల్లో తాను అనుభవించిన భాదని వెళ్ళగక్కేసింది. . ‘అమ్మాయిలు ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో విహరించే సమయంలో నేను ఎంతో కష్టపడ్డాను. సుదీర్ఘంగా పనిచేయాల్సి వచ్చేది. మహేశ్‌ భట్‌ లాంటి మేధావులు, సామాజికవేత్తలతో కలిసి కూచొని పని చేయాల్సి వచ్చేది. మీరొక టీనేజర్‌గా ఉండి అంతటివారితో కూర్చున్నప్పుడు ఏమీ మాట్లాడే వీలుండదు'

    టీనేజర్‌గా ఉండగానే

    టీనేజర్‌గా ఉండగానే

    ‘చిన్న వయస్సులోనే ఇంటి నుంచి వచ్చేయడంతో అందరి పిల్లలాగా నాకు ఆడుకునే వీలుగా చిక్కలేదు. టీనేజర్‌గా ఉండగానే నాకు కష్టాలు ఎదురయ్యాయి. సెట్స్‌లో పనిచేయాల్సి వచ్చింది. 17 ఏళ్ల వయస్సులోనే జీవన్మరణ సమస్యలు ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఎప్పుడూ తిరుగుబాటుతత్వమే' అంటూ చెప్పుకొచ్చింది.

    వారసత్వం

    వారసత్వం

    ఇక అన్ని ఇండస్ట్రీలూ మాట్లాడటానికే ఆలోచించే "వారసత్వం" మీద మరింత గట్టిగా తన అభిప్రాయం చెప్పేసింది. ఇంటర్వ్యూలో భాగంగా వారసత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ వస్తున్న నెగెటివ్ టాక్‌పై అనుపమ్ ఖేర్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. అంతేకాదు.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌పైనా విమర్శలు గుప్పించింది.

    పదేళ్ల పాటు నేను కష్టపడ్డాను

    పదేళ్ల పాటు నేను కష్టపడ్డాను

    ‘‘ప్రస్తుతం నడుస్తున్న చర్చలు నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. నా పనిపై వాటి ప్రభావం ఉండదు. నాకు జరిగింది నేను చెప్పాను. అందులో తప్పైతే నాకు కనిపించట్లేదు. స్టార్ల పిల్లలపై పరిశ్రమ చూపిస్తున్న శ్రద్ధ నాలాంటి బయటివాళ్లపై చూపించట్లేదు. అదే చెప్పాను. పదేళ్ల పాటు నేను కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాను.

    నా జీవితం అసాధారణమైనది

    నా జీవితం అసాధారణమైనది

    నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎంతమందిని ఎదురించి ఉంటాను..? ఇన్నేళ్లపాటు నాతో కలిసి ప్రయాణం చేసిన వారిని అడగండి తెలుస్తుంది.. నేను ఎంతమందిని ఎదిరించి ఇలా ఉన్నానో. నా జీవితం అసాధారణమైనది. అంతెందుకు నేనే ఓ అసాధారణమైన వ్యక్తిని'' అని చెప్పుకొచ్చింది కంగన.

    English summary
    Kangana Ranaut was recently on the chat show, Anupam Kher’s Peoplem, kangana shared that at the age when people write love letters and go on blind dates, she was busy working, with the talented people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X