twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రజల జీవితాన్ని మార్చేశాడు: వాజ్‌పేయి మరణంపై రాజమౌళి, ఎన్టీఆర్, రానా ఇంకా స్టార్స్!

    By Bojja Kumar
    |

    భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు, చారిత్రక నిర్ణయాలు తీసుకున్న గొప్ప ప్రధాన మంత్రుల్లో ఒకరిగా కీర్తిగడించిన ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్, రానా, మంచు విష్ణు తదితరులు వాజ్‌పేయిని గొప్ప రాజకీయవేత్తగా, దేశానికి అణుశక్తి కవచం ఏర్పరచడంలో కృషి చేసిన వ్యక్తిగా, ఇకా ఆయన చేసిన గొప్ప పనులను కీర్తిస్తూ ట్వీట్ చేశారు.

    రాజమౌళి

    రాజకీయలకు గౌరవం తెచ్చిన వ్యక్తి ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చింది... అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

    ఎన్టీఆర్ సెల్యూట్

    మన దేశాన్ని లీడ్ చేసిన గ్రేట్ లీడర్స్‌లో ఒకరైన వాజ్ పేయి గారికి సెల్యూట్. గొప్ప రాజకీయవేత్త, గొప్ప జాతీయ వాది, గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

    రానా ట్వీట్

    ఈ రోజు మనం గొప్ప రాజనీతజ్ఞుడు, రచయిత, వక్తను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను... అని రానా ట్వీట్ చేశారు.

    మంచు విష్ణు

    నా ఫేవరెట్ పొలిటీషియన్ వాజ్ పేయి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన ఎన్నో మంచి పనుల రూపంలో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

    గౌతమి

    వాజ్ పేయి మరణంపై ప్రముఖ నటి గౌతమి స్పందిస్తూ... ఆయన దేశానికి చేసిన సేవ ఎంతో మందికి స్పూర్తి దాయకం అన్నారు.

    అల్లరి నరేష్

    వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ... అల్లరి నరేష్ ట్వీట్.

    ఈషారెబ్బ

    వాజ్ పేయిని తలుచుకుంటూ హీరోయిన్ ఈషా రెబ్బ ట్వీట్. ఆయన్ను గొప్ప రాజకీయ వేత్తగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.

    సురేష్ ప్రొడక్షన్

    అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి ఆకస్మిక మరణం కారణంగా ఇవాళ సాయంత్రం జరగాల్సిన మా దర్శకుడితో మీ సంభాషణ ని ఆపివేయడం జరుగుతుంది... భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ #AtalBihariVajpayee గారి మరణానికి చింతిస్తూ... ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము... అని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది.

    English summary
    Former Prime Minister Atal Bihari Vajpayee passed away on August 16 at 5.05pm. Many of the politicians, celebrities are condolences for his soul rest in peace.Filmmaker SS Rajamouli, Jr NTR, Vishnu Manchu and several other Telugu celebrities condoled the death of former Prime Minister Atal Bihari Vajpayee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X