గద్దర్ అంత్యక్రియలపై వివాదం.. పోలీసులను అవమానించడమే అంటూ ప్రభుత్వంపై ఫైర్
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన యుద్ధ నౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 6 ఆదివారం రోజున సాయంత్రం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఒక ఓ ఊపు ఊపిన ఈ ప్రజాగాయకుడు అంత్యక్రియలను సోమవారం అంటే ఆగస్టు 7న హైదరాబాద్ గన్ పార్క్ లో నిర్వహించనున్నారు. అయితే గద్దర్ అంత్యక్రియలపై సరికొత్తగా వివాదం నెలకొంది. అది ఎందుకునే విషయంలోకి వెళితే..
ప్రజా గాయకుడిగా ప్రాముఖ్యత సాధించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన 1949లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవం వైపు నడిపించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్న గద్దర్ పల్లె పల్లె తిరిగి ఉద్యమాన్ని మరింతగా ఉద్ధృతం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథ ప్రదర్శన ఎంచుకున్నారు.

పొడుస్తున్న పొద్దు, అమ్మా తెలంగాణమా వంటి పాటలతో ఆకట్టుకున్న గద్దర్ గుండెపోటుతో జూలై 20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ జరిగింది. అనంతరం కోలుకున్న గద్దర్ ఊహించని విధంగా ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు తలెత్తడంతో కన్నుమూశారు. గద్దర్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో అభిమానుల సందర్శానార్థం ఉంచారు. అనంతరం గన్ పార్క్ కు తరలించి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడు ఇదే వివాదంగా మారింది.
గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవపరచడమే అంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) అభ్యంతరం తెలిపింది. అలా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు. విప్లవ పాటల ద్వారా వేలాది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించిన వ్యక్తి గద్దర్ అని తెలిపారు.
ప్రజస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను, పౌరులను జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి వేల మంది ప్రాణాలు బలిగొన్నారని శశిధర్ వెల్లడించారు. సాయిధ పోరాటాలు చేయడానికి, యువతను దేశద్రోహులకు తయారు చేయడానికి తన సాహిత్యం ఉపయోగపడిందని మండిపడ్డారు. అలాంటి గద్దర్ కు నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దహనసంస్కరణ చేయడం ఖండిచదగిన చర్యగా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











