వాళ్ల కోడలు స్థానం దక్కడం ఎంతో గర్వంగా ఉంది: ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన అత్తయ్య, మామయ్యలతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి దంపతులను తాను ఎంతగా ఆరాధిస్తున్నానో చెప్పే ప్రయత్నం చేశారు.
ఆదివారం ఉదయం చిరంజీవి, సురేఖ ఫోటోలు ఉపాసన ట్విట్టర్లో షేర్ చేశారు. ఓ ఫోటోలో చిరంజీవి బి పాజిటివ్ మేగజైన్ చదువుతూ కనిపించారు. మరొక ఫోటోలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్‌తో సురేఖ దర్శనమిచ్చారు. అపోలో లైఫ్ పేరుతో హెల్త్ కేర్ వ్యాపారం నిర్వహిస్తున్న ఉపాసన... బి పాజిటివ్ అనే హెల్త్ మేగజైన్ సైతం రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
'నా బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ వీరే. నాకు కెరీర్ పరంగా సపోర్ట్ ఇవ్వడంతో పాటు వర్క్ పరంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అత్తమ్మ, మామయ్య ప్రతి ఫ్యామిలీకి స్పూర్తి. అలాంటి దంపతుల కోడలు అయినందుకు గర్వంగా ఉంది... అని ఉపాసన ట్వీట్ చేశారు.

ఉపాసన రన్ చేస్తున్న బి పాజిటివ్ మేగజైన్ ఆగస్టు సంచిక కవర్ పేజీపై ఈ సారి మెగాస్టార్ దర్శనమిచ్చారు. ఇందులో చిరంజీవి లైఫ్ స్టైల్, హెల్త్ కేర్, డైట్ లాంటి అనేక విషయాలతో పాటు త్వరలో విడుదల కాబోతున్న 'సైరా నరిసింహారెడ్డి' చిత్రానికి సంబంధించిన విషయాలు వెల్లడించడంతో ఈ మేగజైన్ హాట్ కేకుల్లా అమ్ముడవుతోందట.


Click it and Unblock the Notifications











