‘అత్తారింటికి దారేది’ మరో రికార్డు
హైదరాబాద్: రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీసు వద్ద అదరగొడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో రూ. 10 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఇదో అరుదైన రికార్డు.
ఇప్పటికే 'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో రూ. 10 కోట్ల షేర్ సాధించింది. తాజాగా సీడెడ్ ఏరియాలోనూ రూ. 10 కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మూడు ఏరియాల్లోనూ రూ. 10 కోట్ల షేర్ సాధించిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకే దక్కింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇప్పటికే 39 రోజులు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తుండటం గమనార్హం. త్వరలోనే సినిమా రూ. 100 కోట్ల షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా పవర్ కళ్యాణ్ చరిత్రకెక్కనున్నాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












