నైజాం: 20 కోట్ల మార్కు దాటిన ‘అత్తారింటికి దారేది’
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం నైజాం ఏరియాలో ఈ రోజుతో 20 కోట్ల మార్కును క్రాస్ అయింది. 'మగధీర' సినిమా తర్వాత నైజాం ఏరియాలో రూ.20 కోట్ల మార్కు దాటిన సినిమా ఇదే కావడం గమనార్హం. కలెక్షన్స్ ఇంకా స్టేబుల్‌గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల టాక్. మరి సినిమా ఇక్కడ ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 65 నుంచి 70 కోట్లు వసూలు చేసిందని అంచనా...ఒక ఏపీలోనే మొత్తం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు చెబుతున్నారు. సినిమా జోరు చూస్తుంటే కలెక్షన్ల పరంగా నెం.1 పొజిషన్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












