»   »  ‘అత్తారింటికి దారేది’ఆడియో రికార్డులే రికార్డ్

‘అత్తారింటికి దారేది’ఆడియో రికార్డులే రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కల్యాణ్, సమంత జంటగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న 'అత్తారింటికి దారేది' అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆగస్టు 7న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధించిందని, రికార్డులు క్రియేట్ చేస్తోందని నిర్మాత తెలియచేసారు.


నిర్మాత బి.వి.ఎస్. ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ- ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ చేస్తున్నామని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ఎక్కడవిన్నా ఇవే పాటలు వినబడుతున్నాయని తెలిపారు. ఆడియో పరంగా రికార్డులు సృష్టిస్తున్న ఈ చిత్రం, విడుదలయ్యాక కూడా రికార్డులు సృష్టిస్తుందని, ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 7న విడుదలకు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు అతడు, జులాయి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభేంటో రూచి చూపించారు. ఆయన సినిమాలు ఎంటర్టెన్మెంట్ పెట్టింది పేరు అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 'అత్తారింటికి దారేది' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ విషయంలో కానీ, సీన్లు విషయంలో కానీ కాంప్రమైజ్ అయ్యే రకంకాదు. తను అనుకున్నట్లు సీన్ వచ్చే వరకు తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. ఇక ఆయన పవన్ కళ్యాన్ కోసం ప్రత్యేకించి రాసే పంచ్ డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షనను తెస్తాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత హీరోయిన్. పవన్ కళ్యాణ్‌తో నటించడం తన అదృష్టమని ఇటీవల సమంత ఆడియో వేడుకలో వ్యాఖ్యానించింది.


పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Atharintiki Daaredhi's music scored by Devi Sri Prasad is getting fabulous response. Elated producer BVSN Prasad says the songs are now being played in every nook and corner of Andhra Pradesh. "Not just music, even the theatrical trailer are creating records on the web. Currently re-recording work is being done. Pawan Kalyan fans are eagerly waiting for the movie. And we are going to release the movie on August 7th worldwide," he said in a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu