ఫోటో : పవన్ ‘అత్తారింటికి దారేది’ ఫస్ట్ లుక్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఆయన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అదే విధంగా రేపు ఫస్ట్ లుక్ టీజర్ విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ అఫీషియల్‌గా ఖరారు చేసారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ ఇది. ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ అవుతుందని దాన్నే ఖరారు చేసాం' అన్నారు.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నదియా, అలీ, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











