పవన్ ఫ్యాన్స్ కు ధాంక్స్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ హీరోగా, స్టార్ రైటర్,డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రె.లి.పతాకంపై భారీ నిర్మాత ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం ఆడియో జూలై 19న విడుదలై ఇన్ స్టెంట్ గా సూపర్ హిట్ అయ్యింది.
ఈ సందర్బంగా నిర్మాత బి.వి.ఎన్.ఎస్ ప్రదాస్ కృతజ్ఞతలు తెలియచేస్తూ.... మా అత్తారింటికి దారేది ఆడియో సూపర్ హిట్టైంది. అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ అద్బుతంగా వస్తోంది. పవన్,త్రివిక్రమ్, దేవిశ్రి ప్రసాద్ కాంబినేషన్ లోజల్సా తర్వాత మరోసారి అత్తారింటికి దారేది ఆడియోను బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ చేసిన శ్రోతలకు,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు.
అలాగే అభిమానులు మధ్య ఎంతో వైభవంగాజరిగిన ఈ ఆడియో పంక్షన్ ని పవన్ అభిమానులు ఎంతో డిసిప్లిన్డ్ గా ఉండి ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సక్సెస్ చేసారు. ఈ పంక్షన్ ఇంత సక్సెస్ కావటానికి కారకులైన పోలీస్ శాఖ వారిని, మా యూనిట్ మెంబర్స్ కు స్పెషల్ ధాంక్స్. ఆగస్ట్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












