‘అత్తారింటికి..’ఆడియో శిల్పకళావేదిక, ఫ్యాన్స్ టెన్షన్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల తేదీతో పాటు వేదిక కూడా ఖరారైంది. ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
అసలు ఆడియో వేడుక ఉంటుందో? లేదో? అనే సందేహంతో ఇన్నాళ్లు టెన్షన్ పడ్డ అభిమానులకు ఇది శుభవార్తే అయినా.... ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక జరుగుతుండటంతో స్టేట్ వైడ్‌గా ఉన్న అభిమానులు ఆడియో వేడుక పాసుల కోసం తమ శక్తిమేర ట్రై చేస్తున్నారు.
అయితే ఇటీవల జరిగిన కొన్ని విషాద సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఇలాంటి ఆడియో వేడుకలకు అనేక ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేయాల్సిన పరిస్థితి. దీంతో ఆడియో వేడుక చూసే చాన్స్ దక్కుతుందో? లేదో? అని టెన్సన్ పడుతున్నారు పలువురు అభిమానులు.
పవన్ స్టార్ హీరో కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. పూర్తి వినోదాత్మక ఫ్యామిలీ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈ నెల 19న సినిమా విడుదల చేసి, ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











