»   » అంటీ ముట్టనట్లు ఉంటున్న పవన్ కళ్యాణ్!

అంటీ ముట్టనట్లు ఉంటున్న పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన బాధ్యతను అనుకున్న సమయానికి చిత్తశుద్ధితో పూర్తి చేయడమే తప్ప ఫలితం గురించి ఆలోచించని తత్వం పవన్ కళ్యాణ్. 'అత్తారింటికి దారేది' విషయంలోనూ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగుకు సంబంధించి తన బాధ్యత పూర్తవడంతో అంటీ ముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. సినిమా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ఆయన అసలు పట్టించుకోవడం లేదట.

'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 9న విడుదల కావాల్సి ఉండగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల కారణంగా విడుదల నిలిపి వేసిసన సంగతి తెలిసిందే. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేకున్నా....ఆగస్టు నెలాఖరులోగా సినిమా చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.....పరిస్థితి అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరుకల్లా సినిమా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి. మరో వైపు సినిమాను అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Power Star Pawan Kalyan’s ‘Atharintiki Dharedhi’ was supposed to release on August 9th, but it has been postponed due to the political agitations in the state. film Nagar source August last week is considered for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu