బ్లాక్ అయిన అతిథి టికెట్లు???
అతిథి సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా 712 థియోటర్లలో విడుదల అవనున్నది. పోకిరిలాగా అతిథి కూడా చరిత్ర సృష్టిస్తుందని చిత్ర హీరో మహేష్ బాబు పదేపదే చెబుతుండడం, సినిమా ఆడియోకు యమా క్రేజ్ రావడంతో సినిమా టికెట్ల కోసం అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా విడుదలకు ముందురోజైన బుధవారమే టికెట్లను బ్లాక్ అమ్ముతున్నట్టు అభిమానులు చెబుతున్నారు. ఒక్కో టికెట్ ధర రూ.500 పలుకుతున్నట్టు వినికిడి. విడుదల రోజు గురువారం(అక్టోబర్ 18)నాడు ఎంత పలుకుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











