హిందీలోకి అతిథి
తెలుగులో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన అతిథి సినిమాను హిందీలోకి డబ్ చేయాలని యోచిస్తున్నారు. ఉత్తర భారతంలో మహేష్ బాబు కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అతిథి సినిమాను పంపిణీ చేసిన యుటివి సంస్థ ఈ సినిమాను డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ఈ సినిమాను యుటివితో సంయుక్తంగా హిందీ డబ్ సినిమాను మార్కెట్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అమృతారావు వివాహ్ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులకు చిరపరిచితురాలు కావడం అతిథి హిందీ సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











