అందరూ తిట్టారని, ఆ సీన్లు తీసేయమంటోందట: ఆ వివాదాస్పద ట్రైలర్ ఇదే (వీడియో)
హీరోయిన్ అతుల్య సిగరెట్ తాగడం, కురచ దుస్తులతో అందాలు ఆరబోయడం వంటి దృశ్యాలపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, అతుల్య ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Recommended Video

తమిళంలో "ముగవరి", "తొట్టి జయా", "నేపాలి" తదితర హిట్ చిత్రాలను తీసిన వి.ఇ.దురై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఏమాలి". శ్యామ్ జోన్స్, అతుల్య హీరోహీరోయిన్లు. సముద్రగని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఉన్న డైలాగ్స్, సీన్లు నెట్టింట వైరల్ గా మారాయి.

అతుల్య కురచ దుస్తులు
హీరోయిన్ అతుల్య కురచ దుస్తులు ధరించి అందాలను ఆరబోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతుల్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతుల్య స్పందించింది. టీజర్ లో ఉన్న సీన్లను చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దని... తను పోషించింది చాలా మంచి విషయాలను చెప్పే పాత్ర అని ఫేస్ బుక్ లో తెలిపింది.

ఈ తరం యువత
అయితే, టీజర్ లో ఉన్న సీన్లు తనకు కూడా బాధగా అనిపించాయని... వాటిని తొలగించాల్సిందిగా దర్శకుడిని కోరుకుంటున్నానని చెప్పింది. ఈ తరం యువత జీవన విధానాన్ని ప్రతిబింబించే కథతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

సిగరెట్ తాగడం, కురచ దుస్తులతో
ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే ‘ఏమాలి' టీజర్‌ను విడుదల చేశారు. అందులో సంభాషణలు, దృశ్యాలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా హీరోయిన్ అతుల్య సిగరెట్ తాగడం, కురచ దుస్తులతో అందాలు ఆరబోయడం వంటి దృశ్యాలపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, అతుల్య ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
తప్పుగా ఊహించుకోవద్దు
దీనిపై ఆమె స్పందిస్తూ... ‘టీజర్‌లో ఉన్న దృశ్యాలను బట్టి సినిమాలో నేను నటించిన పాత్ర గురించి తప్పుగా ఊహించుకోవద్దు. అది చాలా పాజిటివ్ క్యారెక్టర్. మంచి విషయాల గురించి చెప్పే పాత్ర. అయినప్పటికీ టీజర్‌లో ఉన్న దృశ్యాలు నాకు కూడా బాధగా అనిపించాయి. ఆ దృశ్యాలు సినిమాలో నుంచి తొలగించాలని దర్శకుడిని కోరుతున్నాను' అని ఫేస్‌బుక్‌లోనే పేర్కొంది. మొత్తానికి ఈ వ్యవహారంతో ‘ఏమాలి'కి మంచి పబ్లిసిటీనే లభించింది.


Click it and Unblock the Notifications











