»   » ఈ పాటలో ఇలియానా అద్బుతం... అయినా ఫేట్ మారనే లేదు పాపం (వీడియో)

ఈ పాటలో ఇలియానా అద్బుతం... అయినా ఫేట్ మారనే లేదు పాపం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీ టౌన్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న ఆ గోవా బ్యూటీకి ఏ విధంగానూ కాలం కలిసి రావడం లేదని సమాచారం. రీసెంట్‌గా అమ్మడు తళుక్కుమన్న పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినా ఆమెకు మాత్రం ఇందుకు తగ్గ మైలేజీ రాలేదట. ఎంత ప్రయత్నించినా... బాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్న ఇలియానా... ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆరాటపడుతోందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఇల్లీ బేబీ... ఆఫర్ల కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా... అవేవీ సక్సెస్ కావడం లేదని సినీ జనం ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా రీసెంట్‌గా సింగర్ ఆతిఫ్ అస్లామ్ పాడిన 'పెహ్లీ దఫా' అనే సాంగ్‌లో తళుక్కుమన్న ఇలియానా...ఈ వీడియో ఆల్బమ్‌తో అయినా తన ఫేట్ మారుతుందని ఆశపడిందని టాక్.

ఇలియానాతో కలిసి పాకిస్తానీ యువ గాయకుడు అతిఫ్‌ అస్లామ్‌ పాడి, విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌ 'పెహ్లీ దఫా'.. ఈవారం యూట్యూబ్‌ ట్రెండ్స్‌లో 3వ స్థానంలో ఉంది. 2011లో 'బోల్‌' అనే పాకిస్తానీ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన అతిఫ్‌ ఇప్పటి వరకు అనేక 'చార్ట్‌-టాపింగ్‌' సాంగ్స్‌ని రికార్డ్‌ చేశారు. ఇక ఇలియానా! మన బాలీవుడ్‌ అమ్మాయి. అప్పుడప్పుడూ తెలుగమ్మాయి. ఈ ప్రైవేట్‌ ప్రేమగీతంలో కాస్త బొద్దుగా నే . షకీల్‌ సొహెయిల్‌ లిరిక్స్‌ రాసి, షిరాజ్‌ ఉప్పల్‌ మ్యూజిక్‌ అందించిన ఈ వీడియోను టీ-సిరీస్‌ అప్‌లోడ్‌ చేసింది.

'నా హృదయం తొలిసారిగా ఊసులు చెబుతోంది. నా కోరికల్లో తొలిసారిగా వేగం కనిపిస్తోంది. తొలిసారిగా నేను నా స్పృహల్ని కోల్పోయాను. నేను ప్రేమను కనిపెట్టాను. అదొక కొత్త అనుభూతి' అని పాట ప్రారంభం అవుతుంది. ఫస్ట్‌ డేట్‌లో ఒక కుర్రాడు వ్యక్తం చేసే ప్రేమభావనల మధురగీతం ఇది. వీడియో టేకింగ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. రెడ్‌ గౌన్‌లో ఇలియానా అంతకన్నా కలర్‌ఫుల్‌గా ఉన్నారు. వీధులు కూడా ఇంటిని అలంకరించినట్లుగా వర్ణమయంగా ఉండడం ఈ సాంగ్‌లోని స్పెషల్‌ ఎట్రాక్షన్‌.

 Ileana D'Cruz


అయితే... ఈ సాంగ్ విషయంలోనూ గోవా బ్యూటీ ఆశలు రివర్స్ అయ్యాయని తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే ఈ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చినా ఇలియానాకు రావాల్సిన క్రేజ్ మాత్రం రాలేదని కొందరు చర్చించుకుంటున్నారు. పాటలో ఇలియానా ఎంత గ్లామరస్‌గా కనిపించినా ఆమెను పట్టించుకునేవారే కరువయ్యారని సమాచారం.

ఇలాంటి వీడియో ఆల్బమ్‌తోనూ ఇలియానాకు తగినంత గుర్తింపు రాలేదంటే ఇక అమ్మడు ఏం చేసినా వేస్టే అని పలువురు ఆమెపై సెటైర్లు వేస్తున్నారట. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడే తెలియదని... కొంతకాలం తరువాత దీని వల్ల వచ్చే లాభాలు ఇల్లీ బేబీకి దక్కుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారట. ఏదేమైనా... బాలీవుడ్‌లో కెరీర్‌పై ఇంకా ఆశలు వదులుకోని గోవా బ్యూటీకి... ఈ హిట్ సాంగ్ ఏమైనా సాయం చేస్తుందేమో చూడాలి.

English summary
The man with golden voice is back after long time we are talking about Atif Aslam. Atif Aslam has come with his new music video with T Series ‘Pehle Dafa’, Song featuring Atif and Ileana D’Cruz. The soulful music composition is done by Shiraz Uppal and the lyrics are penned by Shakeel Sohail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X