'అతిధి తుమ్ కబ్ జావోగే ?' రీమేక్ కి రంగం సిద్దం
హైదరాబాద్ : అజయ్ దేవగన్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రల్లో హిందీ లో వచ్చిన హిట్ అయిన కామెడీ చిత్రం 'అతిధి తుమ్ కబ్ జావోగే ?'. ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవనుంది. శ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.సత్తిబాబు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. తెలుగు చిత్రం రైట్స్ ని సన్ మోషన్ పిక్చర్స్ వారు తీసుకున్నారు. వినోద్ సూర్య దేవర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసం ఉంది. ఈ చిత్రం గతంలో తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన బంధువులు వస్తున్నారు జాగ్రత్త తరహాలో నవ్విస్తుంది.
ఇక గతంలో ఇ సత్తిబాబు, శ్రీకాంత్ కాంబినేషన్ లో ఒట్టేసి చెపుతున్నా, ఓ చినదానా వంటి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. తాజాగా ఇ సత్తిబాబు... అల్లరి నరేష్ హీరోగా యముడికి మొగుడు చిత్రం చేస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'యముడికి మొగుడు'. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించిన ఈ చిత్రంలో రీచాపనయ్ కథానాయికగా నటిస్తోంది. రెండు పాటలు మినహా ఆ ఈచిత్రం షూటింగ్ పూర్తయింది.
శ్రీకాంత్ విషయానికి వస్తే... శ్రీకాంత్ చార్మి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'సేవకుడు' ఈ నెలలోనే విడుదల కానుంది. వి.సముద్ర దర్శకత్వంలో ముత్తినేని సత్యనారాయణ ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -''రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పే కథ ఇది. ప్రతి సమస్యకూ ఇందులో పరిష్కారం చూపిస్తున్నారు. కథకు కీలకమైన రెండు ప్రత్యేక పాత్రలను సూపర్‌స్టార్ కృష్ణ, మంజుల పోషించారు. ఏపీ టూ ఢిల్లీ మాట్లాడుకునేలా ఈ సినిమా ఉంటుంది'' అని చెప్పారు.
అలాగే పుష్యమి ఫిలిం మేకర్స్ అనే నూతన నిర్మాణ సంస్థ శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం నిర్మించనుంది. బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. సత్యనారాయణ ద్వారపూడి దర్శకుడు. వచ్చేవారం ప్రారంభోత్సవాన్ని, వచ్చే నెల తొలివారం చిత్రీకరణను జరుపుకునే ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -''చిరకాలం గర్తుండిపోయే సినిమాలు తీయాలనేది మా వాంఛ. శ్రీకాంత్ సినిమాతో మా సినీ ప్రస్థానానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. దర్శకుడు చెప్పిన కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు శ్రీకాంత్. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











