For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌ నెక్ట్స్: రేసు నుంచి పక్క పరిశ్రమల దర్శకులు ఔట్.. టాలీవుడ్ వాళ్లు కూడా డౌటే.!

  By Manoj
  |

  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ ఊపులోనే అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మరో బడా ప్రాజెక్టు 'RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ తదుపరి సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అతడు పలానా డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడని కొందరు అంటుండగా.. ఇప్పటికే మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని మరికొందరు అంటున్నారు. దీంతో తరచూ ఈ నందమూరి హీరో పేరు వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ నేపథ్యంలో తారక్‌తో సినిమా చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న ఇద్దరు డైరెక్టర్లు రేసు నుంచి తప్పుకున్నారని తాజాగా మరో వార్త ప్రచారం అవుతోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్లు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  ‘కేజీఎఫ్' డైరెక్టర్‌తో సినిమా

  ‘కేజీఎఫ్' డైరెక్టర్‌తో సినిమా

  ‘కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాలో యశ్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనతో తారక్ సినిమా చేస్తున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

  క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  తారక్- ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని స్పందించారు. ‘‘మేము ప్రశాంత్, తారక్‌తో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. ప్రశాంత్ వచ్చి తారక్‌కు స్టోరీ చెప్పి, అది ఆయనకు నచ్చితే కచ్చితంగా ముందుకు వెళ్తాం. అన్నీ ఓకే అయితే బహుశా 2020 చివర్లో మా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటికి ఎన్టీఆర్ ‘RRR', ప్రశాంత్ ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' పూర్తవుతాయి'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

  ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదట

  ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదట

  తాజాగా ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఓ వార్త బయటకు వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా ఉంటుందని అనుకున్నప్పటికీ ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. దీనికి కారణం ప్రశాంత్ ‘కేజీఎఫ్ 2' షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతుండడమేనని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ తర్వాతి సినిమా ప్రశాంత్‌ డైరెక్ట్ చేయడం లేదని టాక్.

  తమిళ డైరెక్టర్ కూడా దూరమే

  తమిళ డైరెక్టర్ కూడా దూరమే

  ఇక, మరో సంచలన డైరెక్టర్ అట్లీ కూడా తారక్‌తో సినిమా చేయబోతున్నాడని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ వార్తలకు కూడా తాజాగా పుల్‌స్టాప్ పడిపోయింది. ఆయన ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌కు కథ చెప్పేశారని, ఆయనతో త్వరలోనే ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నారని దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. సో.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఓ ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. దీంతో అట్లీ కూడా ఇప్పట్లో ఖాళీ అవడని తెలుస్తోంది.

  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా..

  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా..

  పక్క ఇండస్ట్రీల దర్శకులు తప్పితే తెలుగులో పేరు మోసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. వీరిలో కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న ‘గోవింద ఆచార్య' పనులతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యే సరికి ఏదాడి పట్టొచ్చు. అలాగే, త్రివిక్రమ్ కూడా ‘అల.. వైకుంఠపురములో' తర్వాత మహేశ్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో వీళ్లిద్దరు కూడా ఖాళీగా లేరు.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  ఎన్టీఆర్ మాత్రం ఆయనకు లాక్

  ఎన్టీఆర్ మాత్రం ఆయనకు లాక్

  తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.

  English summary
  r NTR who made Mythri Movie Makers reach KGF director Prashant Neel to pay advance for their combination. But then, the director went ahead with KGF2 and is looking forward to carving out a film with Another Star Hero first. So there is no clarity when he will be teaming up with Jr NTR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X