కిడ్నాప్, లైంగిక వేధింపులు: తొలిసారి మీడియాతో హీరోయిన్....అతడికి వార్నింగ్!
లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్ తొలిసారిగా స్పందించారు. తన మౌనాన్ని అలసుగా తీసుకుంటే సహించేది లేదని తెలిపారు.
కేరళకు చెందిన ఓ హీరోయిన్‌ను కారులో కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం అప్పట్లో సంచలనం అయింది. తెలుగులో 'మహాత్మ' మూవీలో హీరోయిన్‌గా నటించిన ఆమెపై ఫిబ్రవరిలో ఈ దాడి జరిగింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ మీడియాతో మాట్లాడని ఆ నటి తొలిసారిగా స్పందించారు. ఆమె ఇపుడు మీడియా ముందుకు రావడానికి కారణం.... ఇటీవల ఓ ఇంట్వ్యూలో కేరళకు చెందిన నటుడు దిలీప్ ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే.

నటిని ఉద్దేశించి దిలీప్ కామెంట్స్
నటుడు దిలీప్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘సదరు నటి, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి మంచి మిత్రులని... ఆ సంఘటనకు ముందు ఇద్దరు సన్నిహితంగానే ఉండేవారని, ఎవరితో స్నేహం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ పరోక్షంగా ఆ నటిని ఉద్దేశిస్తూ' కామెంట్ చేశారు.

నొచ్చుకున్న నటి
దిలీప్ వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆ హీరోయిన్.... మీడియాకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘నా వద్ద డ్రైవర్‌గా పని చేసి, నాపై జరిగిన కేసులో ప్రస్తుతం నిందితుడుగా ఉన్న పల్సర్ సునీల్, నేను స్నేహితులమని అనడం నాకు చాలా బాధ కలిగించింది' అని ఆమె తెలిపారు.

మరోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే చట్ట పరంగా చర్యలు
ఆధారాలు లేకుండా మరోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడను అని సదరు నటి వార్నింగ్ ఇచ్చింది.

అందుకే స్పందించలేదు
తాను ఏం మాట్లాడినా కేసు దర్యాప్తు మీద ప్రభావం పడుతుందని పోలీసులు చెప్పడంతోనే ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని సదరు నటి పేర్కొన్నారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications











