బూతులు ఉన్నాయంటూ ధియోటర్ పై దాడి
'ఢిల్లీ బెల్లీ' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఇండోర్ లోని ఒక సినిమాహాలుపై హిందూమతవాద సంస్థ 'హింద్ సంఘటన్' దాడి చేసి విధ్వంసం సృష్టించింది. అసభ్యకరమైన భాష, అశ్లీలదృశ్యాలు ఇందులో ఉన్నాయని వారు ఆరోపించారు. ఈచిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తర్వాత వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమంతట తాము లొంగిపోయారు. కాగా నగరంలోని అనూప్ ధియేటర్‌పై దాడి చేసిన జాగో హింద్ సంస్థ సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో బూతు డైలాగులున్నాయని యువతకు చెడు సంకేతాలు వెళుతున్నాయని సంస్థ సభ్యులు అన్నారు. సినిమాహాలు గాజు తలుపులు కిటికీలు పగులగొట్టారు. అంతకు ముందు సినిమా పోస్టర్లను తగులపెట్టారు. ఇక అమీర్ ఖాన్ మేనల్లుడు హీరోగా చేసిన ఈ చిత్రం ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీన్ని తెలుగులోకి సైతం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక అమీర్ ఖాన్ ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఈ చిత్రం కేవలం పెద్దవాళ్ళకే మాత్రమే అని స్పష్టం చేస్తూ ప్రకటన చేసారు.


Click it and Unblock the Notifications











