నటి కుష్భూ ఇంటిపై దాడి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ డిఎంకె వారసుడు ఎవరో జనరల్ కౌన్సిల్ తేల్చుతుంది, డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ లేదా ఇంకెవరైనా కావచ్చు అంటూ కుష్బూ వ్యాఖ్యానించారు. దీంతో స్టాలిన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో వైపు స్టాలిన్ కూడా ఆమె వ్యాఖ్యలపై మండి పడ్డారు.
డిఎంకె పార్టీలో గత కొంత కాలంగా వారసత్వ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. వయోభారంతో బాధపడుతున్న డిఎంకె అధినేత ఎం కరుణానిధి తన తదనంతరం పార్టీ బాధ్యతలు ఎవరు చేపడతారనే విషయంలో కరుణాది కుమారులు స్టాలిన్, అళగిరి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఖుష్బూకు వివాదాలు కొత్తేమీ కాదు. పార్టీ పరంగానే కాకుండా ఆమె ఇతర అంశాల విషయంలో కూడా వివాదాలకు కేంద్రం మారింది. గతంలో పెళ్లి కాకముందు సెక్స్ తప్పుకాదని వ్యాఖ్యానించి తమిళనాడు ప్రజల ఆగ్రహానికి గురైంది. అదే విధంగా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ సినీ కార్యక్రమానికి ఆమె కట్టుకొచ్చిన చీర కాంట్రావర్శికి దారి తీసింది. హనుమంతుడు, రాముడు,కృష్ణుడు, నరసింహ స్వామి చిత్రాలున్న చీర ధరించి హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications












