పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ పై దాడి
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ధన్ వాడా లో ఉన్న పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ పై ఈ రోజు తెలంగాణా వాదులు దాడి చేసినట్లు సమాచారం. ఇక్కడ పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకోవటం, కొన్ని చిత్రాలుకు షూటింగ్ కు దీనిని వినియోగిస్తూంటారు. ఇక ఈ దాడి ప్రారంభంకాగానే పోలీసులు ఎలర్టై ఆందోళనకారులను అడ్డుకున్నారు. నిన్న అల్లు అర్జున్ వరుడు చిత్రం షూటింగ్ పై కూడా ఈ దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అరవింద్ కూడా వెంటనే స్పందించారు. అలాగే ఈ రోజు ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం షూటింగ్ పై కూడా దాడులు జరిగాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్, ఆ చుట్టు ప్రక్కల తెలంగాణా ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేసుకున్న చాలా మంది వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ లేరు. ఆయన తన లేటెస్ట్ పులి పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు. ఆయన ఈ ఘటనపై ఇప్పటివరకూ ఏ విధమైన కామెంటూ చేయలేదు.


Click it and Unblock the Notifications











