హృదయ కాలేయం హీరో సంపూర్షేష్‌పై దాడి
హైదరాబాద్: 'హృదయ కాలేయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబుపై, దర్శకుడు స్టీవెన్ శంకర్‌లపై శనివారం రాత్రి హైదరాబాదులోని ఓ హోటల్‌లో దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ థియేటర్‌లో హృదయ కాలేయం సినిమా చూసిన తర్వాత చిత్రం విజయవంతమైందనే సంతోషంతో ఓ హోటల్‌లో చిత్రం యూనిట్ సభ్యులు పార్టీ చేసుకుంటున్నారు.
అదే సమయంలో సాఫ్ట్‌వేర్‌కు చెందిన కొంత మంది యువకులు కూడా పార్టీ చేసుకుంటున్నారు. ఈ రెండు వర్గాలు మధ్య మాటా మాట పెరిగి, ఎవరిని పడితే వారిని హీరో చేస్తారా? హీరో అంటే కొన్ని లక్షణాలు, అర్హతలు ఉండక్కర్లేదా? అంటూ, ప్రతివాడూ హీరో అయిపోతున్నాడని మద్యం మత్తులో ఉన్న యువకులు డైరెక్టర్ స్టీవెన్ శంకర్‌పై దాడి చేశారు.

అడ్డుకోబోయిన హీరో సంపూర్ణేష్ బాబుపై కూడా దాడి చేశారు. శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే యువకులంతా ప్రముఖుల పిల్లలు కావడంతో కేసు నమోదు చేయకుండా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందంటూ వార్తలు వచ్చాయి.
ఆదివారం మధ్యాహ్నం వరకు చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ప్రస్తుతం స్టీవెన్ శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంపూర్ణేష్ బాబుకు స్వల్పగాయాలయ్యాయి.


Click it and Unblock the Notifications











