వీడియో : ఉత్కంఠ కలిగించేలా ఆఫీసర్ లేటెస్ట్ టీజర్స్.. సౌండ్ ఎఫెక్ట్ అదుర్స్!
జూన్ 1 న విడుదలకు సిద్ధం అయిన రాంగోపాల్ వర్మ, నాగార్జున ఆఫీసర్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెరిగింది. సోమవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. నాగార్జున, రాంగోపాల్ వర్మ సూపర్ హిట్ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వస్తున్న చిత్రం ఇది. ముంబై మాఫియా నేపథ్యంలో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా వర్మ మరో రెండు టీజర్స్ ని విడుదల చేశారు.
ఆఫీసర్ విన్యాసాలు
నాగార్జున ఈ చిత్రంలో ఎలాంటి విన్యాసాలు చేశాడో శాంపిల్ గా ఓ టీజర్ విడుదల చేశాడు. తన కుమార్తెతో సరదాగా ఉండగా ఉహించని విధంగా అటాక్ మొదలవుతుంది. నాగ్ వెంటనే అలెర్ట్ అయిన అతడి గుండెల్లో బుల్లెట్ దించుతాడు.
ఉత్కంఠ కలిగించేలా
మరో టీజర్లో నాగ్ రౌడీ ముక్కలు ఉన్న డెన్ లో సెర్చింగ్ చేస్తుంటాడు. ఆ సన్నివేశం చాలా ఉత్కంఠని కలిగిస్తోంది.

సౌండ్ ఎఫెక్ట్ అదుర్స్
రెండు టీజర్స్ లో సౌండ్ ఎఫెక్ట్ అదిరిపోయిందనే చెప్పాలి. అద్భుతమైన బ్యాగ్ గ్రౌండ్ సంగీతంలో ఈ చిత్రం ఆధ్యంతం ఉత్కంఠతో సాగేలా కనిపిస్తోంది.

ప్రీరిలీజ్ ఈవెంట్
ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 25 నే విడుదల కావలసి ఉంది. కానీ అనుకోని కారణాల వలన జూన్ 1 కి వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











