»   » పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?

పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం....ప్రస్తుతం జరుగుతున్న యూరఫ్ షెడ్యూల్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే జులై నెలలో ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదే విధంగా అత్తారింటికి దారేది అనే వర్కింగ్ టైటిల్ మార్చి మరో టైటిల్ ఖరారు చేయనున్నారు.

    స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

    ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

    English summary
    Pawan Kalyan-Trivikram Srinivas film 1st look and title will be announced after the Europe schedule. Europe schedule will last for approximately 25 days. Devi Sri Prasad is composing music. Prasad Murella handles cinematography. BVSN Prasad is producing this film on Sri Venkateswara Cine Chitra banner.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more