పవన్ ఏడ్చారు, ఆయనంటే అందరికీ భయం: త్రివిక్రమ్(ఫోటోలు)
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సమంత, నదియా, బ్రహ్మానందం, అలీ, కోట శ్రీనివాసరావు, హేమ తదితరులు హాజరయ్యారు.
ఆడియో వేడుక చాలా సింపుల్‌గా...పొగడ్తలతో కూడిన సుత్తి ప్రసాంగాలు లేకుండా ఆసక్తిరరంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి సామాన్య అభిమానులకు తెలియని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆవేంటో ఆయన మాట్లో....
త్రివిక్రమ్ మాట్లాడుతూ... జల్సా సినిమా చేయడానికి ముందు ఆయన్ను బంగారం సెట్లో తొలిసారి కలిసాను. అప్పుడు ఊరిబయట షూటింగ్ జరుగుతోంది. ఒక ప్రశాంతమైన చోట కూర్చుని సినిమా విషయాలు మాట్లాడాలని అనుకున్నాం. అదే ప్రాంతంలో రాళ్లు కొట్టే కూలీలు ఉన్నారు. వాళ్ల పిల్లాడికి అనారోగ్యం చేయడంతో వాళ్లు పడే బాధను చూసి పవన్ చలించిపోయారు. ఆయన కూడా ఏడ్చారు. వెంటనే తన మేనేజర్‌ను పిలిచి ఆ అబ్బాయిన ఆసుపత్రిలో చేర్పించి తన ఖర్చులతో వైద్యం చేయించారు. ఇదీ కళ్యాణ్ గారిని మొదటి సారి చూడ్డం.
త్రివిక్రమ్ పవన్ గురించి ఇతర విషయాలు స్లైడ్ షోలో.....

రెండో సారి కలిసిన సందర్భం త్రివిక్రమ్ ఇలా...
రెండోసారి ఫాం హౌస్‌లో ఆయన్ని కలవడానికి వెళ్లాను. అక్కడ ఒక ఇద్దరు మనుషులు ఐరన్ రాడ్‌కు వాటర్ మోటార్ కట్టి మోసుకెలుతున్నారు. ఆ రాడ్‌కు ఒక వైపేమో ఫాంహౌస్ లో పని చేసే వ్యక్తి...మరో వైపు పవన్ కళ్యాణ్. ఈ సంఘటన చూసి ఆశ్చర్య పోయా. నన్ను చూసిన వెంటనే ఓ పది నిమిషాల్లో వస్తాను కూర్చోమని చెప్పారు. ఆయన సింప్లిసీటీకి ఇది నిదర్శనం.

కోటి విరాళం ఇచ్చారు
జల్సా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ సారి ఆయన ఇంటికెళ్లా. ఆ సమయంలో ఆయన తన వద్ద ఉన్న లైసెన్డ్స్ తుపాకీ తీసుకెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాండోవర్ చేసారు. కొన్ని గంటలకే సిపిఎఫ్(కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్) అనే అర్గనైజేషన్ స్థాపించి తన బ్యాంకు బ్యాలెన్సులో ఉన్న కోటి రూపాయలను విరాళంగా ఇచ్చేసారు. ఇది ఆయన్ను కలిసి మూడో సందర్భంగా...

యుద్ధం చేయడం మాత్రమే మన విధి అన్నారు
పవన్ కళ్యాన్‌ను కలిసిన నాలుగో సందర్భాన్ని గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ...ఆ సమయంలో అప్పుడే చిరంజీవిగారి పార్టీ ఎన్నికల్లో ఓడి పోయింది. పవన్ కళ్యాన్ ఫేసులో ఏమాత్రం ఆందోళన, టెన్షన్ కనపడలేదు. సింపుల్‌గా కాఫీ తాగుతారా? టీ తాగుతారా? అన్నారు. మీరు బాధ ఉన్నపుడు వచ్చాను అనబోయాను...ఈ లోపు పవన్ కళ్యాన్ కల్పించుకుని యుద్దం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది. గెలవడం గెలవక పోవడం మన చేతుల్లో లేదని చెప్పారు.

అత్తారింటికి దారేది టైటిల్ పెట్టడం గురించి చెబుతూ....
ఏదో ఆలోచిస్తుండగా...అత్తారింటికి దారేది టైటిల్ తట్టింది. చిన్న పిల్లలకు చిన్నప్పుడు ఆట ఆడిస్తూ...పప్పేసి, నెయ్యేసి, కూరేసి అని చెబుతూ అత్తారింటికి దారేది అని కితకితలు పెడతారు. కానీ పవర్ స్టార్ సినిమాకు ఈ టైటిల్ సరిపోతుందా? అని డౌట్ పడ్డాను. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. మన సినిమాలో చెబుతున్నది ఇదే కదా...ఆ టైటిలే ఖాయం చేయమన్నారు' అని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌కు భయం లేదు
మామూలు మనుషులకే ఎక్కువ భయాలు ఉంటాయి. భయం లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూసాను. అందుకే అతనంటే చాలా మంది భయపడతారు. అలాంటి మనిషిని ఇంత దగ్గరగా ఉండే అవకాశం రావడం, స్నేహం చేసే అవకాశం రావడం, కలిసి ప్రయాణం చేయడం, నేర్చుకోవడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తాను అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలి
ఆయనతో షూటింగు అంటే సరదాగా ఉంటుంది. సినిమాలో చాలా చోట్ల ఆయన సెన్సార్ హ్యూమర్ కనిపిస్తుంది. ఆయనతో మళ్లీ మళ్లీ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన ముగ్గురు ప్రసాద్ లు(నిర్మాత, సంగీత దర్శకుడు, కెమెరామెన్)ఎంతో కీలకం అని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.

సమంత గురించి మాట్లాడుతూ..
సమంత గురించి దర్శకుడు మాట్లాడుతూ...సమంత ఎంతో వండర్ ఫుల్ యాక్ట్రెస్. తెలుగు బాగా అర్థం చేసుకుంటుంది. మనం చెప్పిన సన్ని వేషాన్ని ఇట్టే అర్థం చేసుకుంటుంది. సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది అని తెలిపారు.

ఎమ్మెస్ నారాయణ
ఎమ్మెస్ నారాయణ మాట్లాడుతూ...ఈ సినిమాకు నాలుగు ముక్కలు ప్రధానమైనవి. ఒక ముక్క పవన్ కళ్యాణ్, రెండో ముక్క పవర్ స్టార్, మూడో ముక్క త్రివిక్రమ్, నాలుగో ముక్క బివిఎస్ఎన్ ప్రసాద్ వీరే ఈ సినిమాను నాలుగు పిల్లర్లలా మోసారు అని వివరించారు.


Click it and Unblock the Notifications











