‘అత్తారింటికి దారేది’ ఆడియో రివ్యూ...

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో ఆల్బం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలకు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి ఇటు పవన్-దేవిశ్రీ కాంబినేషన్, అటు త్రివిక్రమ్-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన హిట్ ఆల్బంగా చెప్పుకోవచ్చు.

Attarintiki Daredi audio review

1. ఆరడుగుల బుల్లెట్టు...
సింగర్ : విజయ్ ప్రకాష్, కెఎల్ఆర్ కార్తికేయన్
రచన : శ్రీమణి
ఇది సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. ఇది కంప్లీట్ బీట్ సాంగ్. రచయిత పవర్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. దేవిశ్రీ మంచి ట్యూన్స్ ఇచ్చారు.

2. బాపుగారి బొమ్మ
సింగర్ : శంకర్ మహదేవన్
రచన : దేవిశ్రీ ప్రసాద్
ఈ పాటను స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ రచించి కంపోజ్ చేసారు. పూర్తి మెలోడీగా సాగే ఈ సాంగుకు దేవిశ్రీ ప్రసాద్ వినసొంపైన లికిర్స్ ఇచ్చారు. పవన్ గత సినిమా 'గబ్బర్ సింగ్'లో ఆకాశం అమ్మాయైతే సాంగు తర్వాత శంకర్ మహదేవన్ పాడిన సాగ్ ఇది. మంచి ఫీల్ ఇచ్చే సాంగ్.

3. దేవ దేవమ్
సింగర్ : పల్లకడ్ శ్రీరామ్, రిటా
రచన : రామ జోగయ్య శాస్త్రి
ఈ సాంగుకు రామజోగ్యశాస్త్రి అందించిన లికిక్స్ బాగున్నాయి. చూస్తుంటే ఇది సిచ్యువేషనల్ సాంగులాగా అనిపిస్తోంది. మంచిక్లాసికల్ టచ్ ఉన్న సాంగ్.

4. కిరాకు
సింగర్ : నరేంద్ర, డేవిడ్ సిమన్
రచన : రామజోగయ్య శాస్త్రి
మాంచి మాస్ బీట్ ఉన్న సాంగ్ ఇది. అదిరిపోయే డాన్స్ మూమెంట్స్‌కు ఛాన్స్ ఉన్న సాంగ్. దేవిశ్రీ తనదైన రీతిలో సంగీతం అందించారు. సినిమాకు ఈ సాంగ్ మంచి ప్లస్సవుతుంది.

5. నిన్ను చూడగానే
సింగర్ : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రి
డిఫరెంటుగా సాగే లిరిక్స్‌తో దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట బాగుంది. టోటల్ సాంగుల్లో దీన్నీ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీనుల విందైన సంగీతం ఆకట్టుకుంటుంది.

6. టైం టు పార్టీ
సింగర్ : డేవిడ్ సిమన్, మాల్గడి శుభ
రచన : రామజోగయ్య శాస్త్రి
ఇదో పార్టీ సాంగ్. నలుగురు హీరోయిన్లు కలిసి చేసే మాస్ ఐటం నంబర్ గా చెప్పొచ్చు. మాంచి ఊపున్న సంగీతంతో అభిమానులను, ప్రేక్షకులను ఊర్రూతలూగించే విధంగా ఈ సాంగ్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X