‘అత్తారింటికి దారేది’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా అని స్పష్టం అయింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం నైజాం రైట్స్ పవన్ వీరాభిమాని, నటుడు అయిన నితిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు నితిన్.
ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్ర్కిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు.
పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











