‘అత్తారింటికి దారేది’ 50 డేస్ థియేటర్లు ఎన్ని?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా పలు రికార్డులు సృష్టించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఫీట్ సాధించబోతోంది. త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈచిత్రం అత్యధిక థియేటర్లలో 50 రోజుల వేడుక జరుపుకోబోతోంది.
ప్రస్తుతం ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా 190 థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. 50 రోజులు పూర్తయిన తర్వాత కనీసం 170 థియేటర్లలో ప్రదర్శితం అవుతూ 100 రోజులు దిశగా సాగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల, సీడెడ్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్ల మార్కను అధిగమించి భారీ కలెక్షన్లు రాబడుతోంది. వైజాగ్, గుంటూరు, కర్ణాటక లాంటి ఏరియాల్లో మగధీర రికార్డులను తుడిపెట్టింది.
ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన అత్తారింటికి దారేది.....రూ. 100 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












