twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ యూరఫ్ షెడ్యూల్ ఖరారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రం యూరప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల చివర్లో చిత్ర యూనిట్ యూరఫ్ వెళ్లనుంది. జూన్ నెల మొత్తం వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్‍‌లో జరుగుతున్న షూటింగ్ ఈ నెల 28తో ముగియనుంది.

    స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ జరుపనున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు. అందులో ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించనున్నారు. అదే విధంగా టాకీ పార్టుకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు.

    ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తం 40 మంది ప్రముఖ తారాగణం మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.'

    English summary
    Europe schedule of Pawan Kalyan - Trivikram film 'will begin from June 1st week. schedule will last for approximately 25 days. Devi Sri Prasad is composing music. Prasad Murella handles cinematography. BVSN Prasad is producing this film on Sri Venkateswara Cine Chitra banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X