పవన్ కళ్యాణ్ దే పంట..
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొంది ఘన విజయం సాధించిన వినోదాత్మక చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో సత్తా చాటి నాలుగు అవార్డులు సొంతం చేసుకొన్న ఆ చిత్రం తాజాగా సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2014లోనూ 12 నామినేషన్లను దక్కించుకుంది.
హీరో,హీరోయిన్స్ గా నటించిన పవన్‌కల్యాణ్, సమంతలకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో నామినేషన్లు లభించాయి. ప్రతీ యేటా దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఈసారి మలేషియాలోని కౌలాలంపూర్‌లో సెప్టెంబరు 12, 13 తేదీల్లో వేడుకల్ని నిర్వహించబోతున్నారు. తాజాగా నామినేషన్లను ప్రకటించింది సైమా కమిటీ. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మిర్చి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలకు కూడా భారీగానే నామినేషన్లు దక్కాయి.

తెలుగులో ఉత్తమ నటుడు పురస్కారం కోసం పవన్‌కల్యాణ్‌తో పాటు మహేష్‌బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), నితిన్ (గుండె జారి గల్లంతయ్యిందే), వెంకటేష్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ప్రభాస్ (మిర్చి), రామ్‌చరణ్ (నాయక్) పోటీపడుతున్నారు.
ఉత్తమ చిత్రం విభాగంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మిర్చి', 'ప్రేమకథా చిత్రమ్' నామినేషన్లు దక్కించుకొన్నాయి. తమిళంలో 'కడల్'కి 8, కన్నడలో 'గూగ్లీ'కి 11, మలయాళంలో 'ఆమెన్' చిత్రానికి 8 నామినేషన్లు దక్కాయి.


Click it and Unblock the Notifications











