పవన్-సింహం గడ్డం గీసుడే తేడా...(థియేట్రికల్ ట్రైలర్)
హైదరాబాద్ : "చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఆయన అభిమానులు ఉర్రూతలూగిస్తోంది.
పవర్ స్టార్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 7న విడుదలవుతున్న నేపథ్యంలో....నిన్న హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక వద్ద జరిగిన ఆడియో వేడుక సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాల మరింత పెరిగాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'అత్తారింటికి దారేది' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఈ చిత్రంలో నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












