»   »  దసరాకు ‘అత్తారింటికి దారేది’(అఫీషియల్)

దసరాకు ‘అత్తారింటికి దారేది’(అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'అత్తారింటికి దారేది'. ఈచిత్రం అక్టోబర్ 9న విజయదశమి కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ...'అత్తారింటికి దారేది చిత్రాన్ని అక్టోబర్ 9న విజయదశమి కానుకగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కి, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాడిన పాట యూట్యూబులో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది' అన్నారు.

'ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోకి విపరీతమైన స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఆడియో అన్ని చోట్లా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం అందర్నీ అలరించడానికి అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని ప్రసాద్ తెలిపారు.

పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyan's Attarintiki Daredi has comleted its Censor formalities and gets Clean 'U' Certificate.The release date is pushed Oct 9th due to various reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu