twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేక పెట్టిస్తున్న పవన్...('అత్తారింటికి దారేది' కొత్త స్టిల్స్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల ఆగినా...క్రేజ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. దానికి తగ్గట్లే చిత్రానికి సంభందించిన కొత్త స్టిల్స్ , పాటల వీడియాలు మీడియాకు నిర్మాతలు విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ని స్టిల్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ స్టిల్స్ లో మరింత యంగ్ గా కనిపిస్తూ అలరిస్తున్నారు.

    సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. తన పాత్ర డబ్బింగ్‌ను పవన్‌కల్యాణ్ ఎప్పుడో పూర్తి చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ అలజడి తగ్గితే రిలీజ్ డేట్ ప్రకటిద్దామని నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ..."ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్: పీటర్ హెయిన్స్.

    స్టిల్స్ ...స్లైడ్ షోలో...

    గాయకుడుగా కూడా...

    గాయకుడుగా కూడా...

    పవన్‌ కల్యాణ్‌ ఇందులో గాయకుడిగా కూడా ఓ పాటను ఆలపిం చారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే విడుదల చేశారు. ఇందులో పవన్‌ చేసిన హమ్‌కి... ఎంతో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాకి సెన్సార్‌ కూడా పూర్తయింది. దీనికి యు సిర్టిఫికేట్‌ వచ్చింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇన్ స్టెంట్ హిట్..

    ఇన్ స్టెంట్ హిట్..

    ఆడియో ఇన్‌స్టెంట్‌గా విడుదలై సూపర్‌హిట్ అయింది. అన్నిచోట్లనుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడుతున్నాయి. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో జల్సా తరువాత మరోసారి ఈ చిత్రానికి ఇంత హైప్ లభించింది.

    కామెడీ సూపర్

    కామెడీ సూపర్

    ఈ చిత్రంపై ఇప్పటికే ఉన్న క్రేజ్ ని మరింత పెంచటానికా అన్నట్లు.... రోజుకొకటి ఈ చిత్రం గురించి రివిల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫెరఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు ప్రాణం అని చెప్తున్నారు. సమంత డీసెంట్ రోల్ ప్లే చేస్తే...ప్రణీత ... గ్లామర్ గా కనిపించి అలరిస్తుందని చెప్తున్నారు.

    బ్రహ్మీ కీ రోల్...

    బ్రహ్మీ కీ రోల్...


    ఇప్పుడు ఏ సినిమాలో చూసినా బ్రహ్మానదం సెకండ్ హీరో తరహాలో సీన్స్ ఉంటున్నాయి. ప్రేక్షకులు సైతం దానిని ఎంజాయ్ చేస్తున్నారు. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ పవన్ కళ్యాన్, బ్రహ్మిల మధ్య ‘అత్తారింటికి దారేది' సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ను పెట్టారు. సమాచారం ప్రకారం వీరిద్దరి నడుమ వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణట. ఇదివరకు చెప్పినట్టే పవన్ ఫుల్ జోష్ తో పాడిన ‘కాటమరాయుడా' పాట సైతం బ్రాహ్మిని ఉద్దేశించి పాడినదే.

    మళ్లీ అత్త -అల్లుడు సవాల్

    మళ్లీ అత్త -అల్లుడు సవాల్

    అత్త పాత్రలో మాజీ హీరోయిన్ నదియా అదరకొట్టిందని సమాచారం. ఆమె పవన్ కళ్యాణ్ తో పోటీపడి మరీ నటించిందని అంటున్నారు. ఆమెకు,పవన్ కి మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయిస్తాయని,ఆమెను పవన్ టీజ్ చేస్తాడని అది ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా ఉన్నారు. అందులోనూ అత్త,అల్లుళ్ల మధ్య నడిచే కథతో వచ్చిన చిత్రాలు తెలుగులో ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం కథాసం మరో సారి హాట్ టాపిక్ గా మారింది.

    దేవి స్పెషల్ అప్పీరియన్స్..

    దేవి స్పెషల్ అప్పీరియన్స్..

    ఈ చిత్రంలో మరో ప్రత్యేకత చోటు చేసుకోనుంది. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మరోసారి తెరపై తళుక్కున మెరవబోతున్నాడు. దేవి ఓ పాటలో కనిపిస్తారు. ఇదివరకు ఆయన 'శంకర్‌దాదా ఎమ్‌.బి.బి.ఎస్‌' చిత్రంలో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇంతకుముందు 'జులాయి' చిత్రంకోసం అల్లు అర్జున్‌తో కలిసి ఓ ప్రచారగీతంలో ఆడిపాడారు దేవి. తమిళంలో 'మన్మదన్‌ అంబు', 'వెడి' చిత్రాల్లోనూ ప్రత్యేక పాత్రలు చేశారు. తాజాగా మరోసారి కెమెరా ముందుకొచ్చారు. 'అత్తారింటికి దారేది' చిత్రానికి స్వరాలు సమకూర్చడంతో పాటు ఇందులో 'నిన్ను చూడగానే...' అంటూ సాగే గీతాన్ని రాశారు దేవిశ్రీప్రసాద్‌. ఆ పాటలోనే ఆయన కనిపిస్తారని తెలుస్తోంది.

    రికార్డ్...

    రికార్డ్...

    ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా...' అనే ఆ పాట తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందు పలు పాటలను పవన్‌కల్యాణ్ పాడినప్పటికీ వాటి విజువల్స్ బయటికి రాలేదు. కానీ ఈ పాటను పవన్ పాడుతున్నప్పుడు చిత్రీకరించి, విడుదల చేశారు. ఇప్పటివరకు పవన్ పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోపే ఐదు లక్షలమందికి పైగా ఈ పాటను వీక్షించడం విశేషం. ఆ విధంగా ఇది సూపర్ డూపర్ హిట్టయ్యిందని అంచనా వేయొచ్చు.

    సింహం డైలాగ్..

    సింహం డైలాగ్..

    త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రాలలో పంచ్ డైలాగులకూ, కామెడీ సీన్లకు కొదవ ఉండదు. ఈ చిత్రంలో కూడా వాటిని మిస్ అవ్వకుండా చూసుకున్నారు. ట్రైలర్ లో ఇప్పటికే వదిలిన డైలాగు జనాలని మెస్మరైజ్ చేస్తోంది. "చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఆయన అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. ఈ ఒక్క డైలాగు జనాలను థియోటర్స్ దగ్గరకు లాక్కువస్తుందని చెప్తున్నారు.

    ఫ్యామిలీలే టార్గెట్..

    ఫ్యామిలీలే టార్గెట్..

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే ‘జల్సా' చిత్రం రూపొంది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో ‘అత్తారింటికి దారేది' చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. అప్పట్లో త్రివిక్రమ్ రచన తో రూపొందిన నువ్వు నాకు నచ్చావు లా అలరిస్తుందని భావిస్తున్నారు.

    బొమన్ ఇరానీ పాత్రతో..

    బొమన్ ఇరానీ పాత్రతో..

    ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొ మన్ ఇరాని కనిపించి అలరించనున్నారు. ఆయన పవన్ కి తాతగాకనిపిస్తారని తెలుస్తోంది. ఆయన పాత్ర సినిమాని లీడ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. స్పెయిన్ లో ఉన్న పవన్ ఇండియా రావటానికి ఈ పాత్ర ప్రేరణ ఇస్తుందని, పవన్ కీ, బొమన్ ఇరానీకి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలకమని చెప్తున్నారు. అందులోనూ బొమన్ ఇరాని ఇప్పటికే ఓ రేంజిలో ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టు. ఆయన ఈ చిత్రానికి ప్లస్ అవుతారనటంతో సందేహం లేదు.

    గ్లామర్ లుక్...

    గ్లామర్ లుక్...

    ఖుషీ,గబ్బర్ సింగ్ ని దాటే చిత్రం అవుతుందని అభిమానులంతా ఈ చిత్రంపై నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం లో పవన్ మరింత గ్లామర్ గా కనిపించటంతో వారి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ పంచ్ లని పవన్ చెప్పే స్టైల్ సైతం సినిమాని ఓ రేంజికి తీసుకువెళ్తుందని ఆశిస్తున్నారు.

    సమంత కేక

    సమంత కేక

    హిట్ లో ఉన్న హీరోయిన్ సమంత ఈ చిత్రంలో పవన్ సరసన చేస్తోంది. అది ఈ సినిమాలో ప్రత్యేకతే అని చెప్పాలి. ఆమె లుక్స్..స్టైల్ ఈ సినిమాకు ప్రధానాకర్షణ అవ్వనుంది. ఆమెకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది. అందులోనూ త్రివిక్రమ్ ఆమెకు ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసి, దానికి తగ్గ గ్లామర్ టచ్ తో చూపించారు.

    English summary
    
 Pawan Kalyan’s easeful performance and Brahmanandam’s comedy are said to be major highlights of ‘Atharintiki Daaredi’ movie. While Samantha played decent role, Praneetha will be seen glamorous especially in songs. Scenes between Pawan and Brahmi are going to be laugh riot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X