»   » ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ ఎప్పుడంటే..?

‘అత్తారింటికి దారేది’ రిలీజ్ ఎప్పుడంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆందోళన కార్యక్రమాలు, చిరంజీవి ఫ్యామిలీ సినిమాలను సీమాంధ్ర ప్రాంతంలో అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో విడుదల నిలిచి పోయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని సెప్టెంబర్ చివరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న గానీ, సెప్టెంబర్ 27న కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyam's Attarintiki Daredi May Release In September 20 or 27. According to inside reports, the main reason for postponing the film was the political tensions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu